లీకులకు కారణం ఆ దర్శకుడేనా..?

Published : Aug 25, 2018, 04:15 PM ISTUpdated : Sep 09, 2018, 01:05 PM IST
లీకులకు కారణం ఆ దర్శకుడేనా..?

సారాంశం

ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధినేత చినబాబు బయట కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు

ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధినేత చినబాబు బయట కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు. సినిమాపై ఎంత బడ్జెట్ పెట్టాలి..? ఎలా ప్రమోట్ చేసుకోవాలని..? ఆయన ఆలోచనల్లో ఆయన ఉంటాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని లీకులు ఇటీవల చిత్రబృందాన్ని కలవరపెట్టాయి.

పైగా హారికా హాసిని నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకి పొక్కాయి. అసలు ఇది ఎలా జరుగుతుందో అర్ధంకాక తలలు పట్టుకున్నారు. అయితే ఇదంతా ఓ దర్శకుడి కారణంగా జరుగుతుందట. ఎప్పటినుంచో ఈ బ్యానర్ లో పని చేయాలని ఎదురుచూస్తోన్న ఓ దర్శకుడు ఉన్నారట. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయాలని హారిక హాసిని నిర్మాతలు అనుకుంటున్నారు.

అయితే హీరో సెట్ కాక ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. హీరోని సెట్ చేసి సినిమా చేయాలనుకుంటున్నారు. దీంతో సదరు డైరెక్టర్ ఈ నిర్మాణ సంస్థతో ట్రావెల్ అవుతున్నారు. అక్కడి సంగతులన్నీ ఇండస్ట్రీలో తన స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేస్తుండడంతో కొన్ని విషయాలు బయటకి వెళ్తున్నాయట. మరి ఇకనైనా ఈ విషయంలో హారిక హాసిని నిర్మాతలు జాగ్రత్త పడతారేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?