కార్తీతో పరశురామ్... విజయ్ దేవరకొండ సంగతేంటి? 

Published : Feb 20, 2023, 02:50 PM IST
కార్తీతో పరశురామ్... విజయ్ దేవరకొండ సంగతేంటి? 

సారాంశం

ఇటీవల దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండతో మూవీ ప్రకటించారు. త్వరలో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అనూహ్యంగా కార్తీ-పరశురామ్ కాంబోలో మూవీ అంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది.   

గీత గోవిందం మూవీతో భారీ కొట్టిన పరశురామ్... మహేష్ ని తన స్క్రిప్ట్ తో ఇంప్రెస్ చేశాడు. వంశీ పైడిపల్లిని కూడా కాదని మహేష్ పరశురామ్ కి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని కొంత మేర సద్వినియోగం చేసుకున్నాడు. సర్కారు వారి పాట మూవీతో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేశాడు. నెక్స్ట్ నాగ చైతన్యతో చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ నచ్చక చైతూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. కారణం ఏదైనా కానీ, చైతు-పరశురామ్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. 

ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో పరశురామ్ మూవీ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండతో మూవీ సెట్ చేశాడు. పరశురామ్ చర్యకు అల్లు అరవింద్ షాక్ తినడంతో పాటు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. విజయ్ దేవరకొండతో గీతా ఆర్ట్స్ లో చేయాల్సిన మూవీ దిల్ రాజుతో ఎలా చేస్తాడు. మాకు చేసిన ప్రామిస్ సంగతి ఏమిటని ఆయన నిలదీసే పరిస్థితి. అల్లు అరవింద్ వద్ద పరశురామ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్. అందుకే అల్లు అరవింద్ కి బాగా కోపం వచ్చింది. 

మరి మెగా ప్రొడ్యూసర్ తో పెట్టుకుంటే పరిశ్రమలో ఎదురుదెబ్బలు తగలొచ్చు. అందుకనే నేరుగా కలిసి అల్లు అరవింద్ ని ప్రసన్నం చేసుకున్నాడని టాక్. ఒక్కడే వెళితే ప్రమాదమని భార్యతో పాటు వెళ్లి అల్లు అరవింద్ తో మాట్లాడరట. అల్లు అరవింద్ మాత్రం శాంతపడలేదని సమాచారం. విజయ్ దేవరకొండతో పరశురామ్ చిత్రం ప్రకటించడం ఇంత పెద్ద వివాదానికి దారితీసింది. 

సడన్ గా హీరో కార్తీతో పరశురామ్ మూవీ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. రెంచ్ రాజు అంటే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో ప్రకటించిన మూవీ ఏమైనట్లు? ఉంటే ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? మూడు కార్తీ మూవీ చేస్తారా లేక విజయ్ మూవీ చేస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే కార్తీ-పరశురామ్ మూవీపై ఇంకా అధికారిక ప్రకటన  జరగలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మూవీ కచ్చితంగా ఉందంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్