కె ఆర్‌ నారాయణన్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ పదవికి అదూర్‌ గోపాలకృష్ణన్‌ రాజీనామా

By Aithagoni RajuFirst Published Jan 31, 2023, 1:45 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత అదూర్‌ గోపాలకృష్ణన్‌ తన కె ఆర్‌ నారాయణన్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

ప్రముఖ దర్శకుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత అదూర్‌ గోపాలకృష్ణన్‌ తన కె ఆర్‌ నారాయణన్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వివాదాలతో అసంతృప్తి చెందిన ఆయన కొట్టాయంలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి సంబంధించిన తన చైర్మెన్‌ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. దర్శకుడు శంకర్‌ మోహన్‌ ఇప్పటికే రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు అదూర్‌. విద్యార్థుల సమ్మెకి సంబంధించిన వివాదాలపై తాను అసంతృప్తికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 

శంకర్‌ మోహన్‌పై ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో అడ్మిషన్లకి సంబంధించి కుల వివక్ష, రిజర్వేషన్‌ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలో నేపథ్యంలో ఇనిస్టిట్యూట్కి డైరెక్టర్‌ శంకర్‌ మోహన్‌ మొదట రాజీనామా చేశారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత నేడు గోపాలకృష్ణన్‌ రాజీనామా చేయడం గమనార్హం. ఇనిస్టిట్యూట్‌లో స్టూడెంట్స్ గత నెలన్నరగా నిరసన తెలియజేస్తున్నారు. ఆందోళన పెరగడంతో తాత్కాలికంగా ప్రభుత్వం దాన్ని మూసేసింది. 

ఈ విద్యార్థుల ఆందోళనకి సినీ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. మోహన్‌పై ఆరోపణలు నిరాధారమైనవి అని గోపాలకృష్ణన్‌ని ఆయనకు మద్దతిచ్చారు.అయితే తాను రాజీనామా చేస్తూ గోపాలకృష్ణన్‌ మాట్లాడుతూ, ఇనిస్టిట్యూట్‌కి సారథ్యం వహించడానికి మోహన్‌ను కేరాళకు ఆహ్వానించారు. అతను అవమానించబడ్డాడు, బలవంతంగా నిష్క్రమించబడ్డాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. దర్శకుడిపై అసంబద్ధ కథనాలు ప్రచారంలోకి వచ్చాయని తెలిపారు. తాము రిజర్వేషన్‌ నింబంధనలను మార్చలేదని, ఎస్సీ ఎస్సీ విద్యార్థులకు కటాఫ్‌ మార్కులను 45కి తగ్గించామని, కానీ ఎవరూ లేరని, దీనిపై ఎల్‌బీఎస్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. 
 

click me!