బాలయ్యతో మాస్ మసాలా పాటకు స్టెప్పులు వేయబోతున్న డింపుల్ హయతి

Published : May 17, 2022, 12:20 PM IST
బాలయ్యతో  మాస్ మసాలా పాటకు స్టెప్పులు వేయబోతున్న డింపుల్ హయతి

సారాంశం

బాలయ్యతో సై అంటే సై అనబోతోంది హాట్ బ్యూటీ డింపుల్ హయతీ. నటసింహంతో మాస్ స్టెప్పులకు రెడీ అవుతోంది.

సూపర్ క్రేజ్ తో దూసుకుపోతోంది హాట్ బ్యూటీ డింపుల్ హయతి. హాట్  హాట్  బ్యూటీతో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది డింపుల్.  మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఖిలాడి సినిమాలో అందాలు ఆరబోసిన బ్యూటీ..అప్పట్లో గద్దలకొండ గణేశ్ సినిమాలో జర్రా జర్రా ఐటమ్ సాంగ్ తో ఆమె కుర్రకారు మతులు పోగొట్టేసింది. 

ఖిలాడి  సినిమాతో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. అదే గ్లామర్ తో అవకాశాలు తన ఖాతాలో వేసుకుంలుంది డింపుల్. అలాంటి అవకాశాన్ని రీసెంట్ గా తన సొంతం చేసుకుంది డింపుల్.  నటసింహం  బాలకృష్ణతో కలిసి ఆమె ఒక మాస్ మసాలా సాంగ్ తో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

బాలయ్య 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ కథలో పవర్ ప్యాక్ యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు బాలయ్య. ఇక బాలకృష్ణ సరసన హీరోయిన్ గా  శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశాడట. ఆ పాటలో  డింపుల్ బాలయ్యతో పాటు దడదడలాడించ బోతునట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే వరుస షెడ్యూల్స్ తో ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను దసరా బరిల్ దింపాలని చూస్తున్నారు మేకర్స్. డింపుల్ హయతీ ఐటం సాంగ్.. అది కూడా బాలయ్యతో అంటే.. అది ఏ రేంజ్ లో ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 
 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?