దిలీప్ కుమార్ సోదరులిద్దరికీ కరోనా

Published : Aug 17, 2020, 09:02 AM IST
దిలీప్ కుమార్ సోదరులిద్దరికీ కరోనా

సారాంశం

వారిద్దరినీ ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.

కరోనా సిని సెలబ్రెటీల కుటుంబాలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆపటం కష్టంగా ఉంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్,టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులకు కరోనా సోకింది. దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఎహసాన్ ఖాన్ లకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 

వారిద్దరినీ ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసఫ్ ఖాన్. ఆయన దేశ విభజనకు ముందు పెషావర్ లో జన్మించారు. దిలీప్ కుమార్ 12 మంది సంతానంలో ఒకరు. ఆయన సినీ రంగంలో ప్రవేశించి తనదైన నటనతో అభిమానులను విశేషంగా అలరించారు. దిలీప్ కుమార్ వయసు 97 ఏళ్లు. 
 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?