సుశాంత్‌ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ ఇద్దరు ఎవరు?

Published : Aug 17, 2020, 09:01 AM IST
సుశాంత్‌ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ ఇద్దరు ఎవరు?

సారాంశం

జాతీయ ఛానెల్‌ రిపబ్లిక్‌ టీవీ సేకరించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇందులో సుశాంత్‌ శవమై ఉన్న చోట నల్ల టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో నల్లని బ్యాగ్‌ కనిపిస్తుంది. అసలు అతను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు.

తీగ లాగితే డొంక కదిలినట్టు బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో కొత్త విషయంలో బయటకొస్తూ సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఓ జాతీయ ఛానెల్‌ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌లో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సుశాంత్‌ చనిపోయిన రాత్రి ఏం జరిగిందనేది ఇప్పుడు ఉత్కంఠకు గురి చేస్తుంది. 

జాతీయ ఛానెల్‌ రిపబ్లిక్‌ టీవీ సేకరించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇందులో సుశాంత్‌ శవమై ఉన్న చోట నల్ల టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు. అతని చేతిలో నల్లని బ్యాగ్‌ కనిపిస్తుంది. అసలు అతను ఎవరు? అక్కడ ఎందుకున్నాడు. అతని చేతిలో ఉన్న బ్యాగ్‌లో ఏముందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే అతను సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శ్రావణ్‌ అని ప్రాథమిక సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు సుశాంత్‌ నివసించే అపార్ట్ మెంట్‌లోకి ఓ లేడీ వచ్చింది. గుర్తుతెలియని విధంగా ఉన్న ఆమె ఎవరు? ఎందుకొచ్చింది. ఆమెకి, సుశాంత్‌ మరణానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె తన ప్రియురాలై ఉంటుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలా అనేక అనుమానాలకు సుశాంత్‌ కేసు తావిస్తోంది. 

ప్రస్తుతం ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ముంబయి పోలీసులపై పలు ఆరోపణలు ఉన్నాయి. కేసులో కొన్ని విషయాలను దాస్తున్నారని, కీలక సమాచారన్ని పక్కన పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సుశాంత్‌ తండ్రి కేకేసింగ్‌ కోరిక మేరకు కేంద్రం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. వాళ్ళు విచారణ చేపట్టాల్సి ఉంది. మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగి రియా కుటుంబ సభ్యులను, పలువురుని విచారించారు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు