శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. స్టార్ ప్రొడ్యూసర్ వారసుడు భలే క్యూట్ గా ఉన్నాడే..

Published : Mar 10, 2023, 04:14 PM IST
శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. స్టార్ ప్రొడ్యూసర్ వారసుడు భలే క్యూట్ గా ఉన్నాడే..

సారాంశం

దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డితో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొడుకు తలనీలాలు సమర్పించేందుకు దిల్ రాజు ఫ్యామిలీతో కలసి తిరుమలకు వెళ్లారు. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించింది. ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో బలగం చిత్రం తెరకెక్కింది. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా దిల్ రాజు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తారు. దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణించగా తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నారు. అనంతరం ఆయన  020లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. గత ఏడాది వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. 

తాజాగా దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డితో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొడుకు తలనీలాలు సమర్పించేందుకు దిల్ రాజు ఫ్యామిలీతో కలసి తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు దిల్ రాజు ఫ్యామిలీకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. 

అయితే ఆలయం బయట దిల్ రాజు కొడుకు అన్వై రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అన్వై రెడ్డి క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఆ చిన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఆలయం బయట దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. నా బలగంతో స్వామివారి దర్శనానికి వచ్చాను. లాస్ట్ వీక్ విడుదలైన మా బలగం చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని దిల్ రాజు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్