పాటకు పదికోట్ల ఖర్చు..? రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ కొత్త ప్రయోగం

Published : Mar 10, 2023, 03:22 PM IST
పాటకు  పదికోట్ల ఖర్చు..? రామ్ చరణ్ సినిమా కోసం శంకర్ కొత్త ప్రయోగం

సారాంశం

ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది RC15 మూవీ. ఇక శంకర్ భారతీయుడు2 షూటింగ్ లో బిజీగా ఉండటం, చరణ్ ఆస్కార్ హడావిడిలో ఉండటంతో.. ఈసినిమా షూటింగ్ కు ఓ నెల రోజులు విరామం ఇచ్చారు టీమ్. ఈక్రమంలో ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.   

రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా RC15.శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో  దిల్ రాజు ఈసినిమాను  నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ జోడీగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్.. చాలా వరకూ కంప్లీట్ అయ్యింది.  బ్యాలెన్స్ షూటింగ్ కు నెలరోజులు సెలవు ప్రకటించాడు డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్ ఆస్కార్ హడావిడిలో ఉండటం. శంకర్ కు ఇండియన్ 2 సినిమా షూటింగ్ లాంగ్ షెడ్యూల్ ఉండటంతో.. ఈమూవీ షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారట టీమ్. 

ఇక ఈసినిమాకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో నెక్ట్స్ షెడ్యూల్ రామ్ చరణ్ పాటలకు సబంధించి ఉంటుందట. ఈ నెల చివరి వరకూ హైదాబాద్ లో..పదికోట్ల వ్యయంతో భారీ సెట్‌ నునిర్మించబోతున్నారట టీమ్.  ఈసెట్ లోనే  పాటను తెరకెక్కించబోతున్నారని సమాచారం. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ పాటకుప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  


ఈ పాట ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధించాలని టీమ్ చూస్తుందట. భారీగా డాన్సర్స్ తో.. డిఫరెంట్ సెట్ లో ప్లాన్ చేస్తున్నారట. శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. భారీ సెట్ ల కోసం.. గ్రాండియర్ లుక్ కోసం.. చాలా ఖర్చు పెడతుంటాడు. రోబ్ 2.0కోసం కూడా శంకర్ ఇలానే ఖర్చు పెట్టించాడు. కాని రోబో వర్కౌట్ కాలేదు. ఈసారి చరణ్ సినిమా కోసం వేసిన సెట్ ప్రత్యేకంగా ఉండబోతునట్టు సమాచారం. మరి ఈసారి శంకర్ ప్రయత్నం ఏమౌతుందో చూడాలి.  

ఇక ఈసినిమాలో రామ్ చరణ్  యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈసినిమాకు రకరకాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఫైనల్ గా  సీఈవో అనే టైటిల్ ను దాదాపు ఫైనల్ చేశారని  సమాచారం. మార్చి 27న రామ్‌ చరణ్‌ బర్త్ డే ను  పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేయడంతో పాటు ఫస్ట్‌లుక్‌ ను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అంతే కాదు ఇక రామ్‌ చరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే