పవిత్ర నరేష్‌ పెళ్లిలో పెద్ద ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా?

Published : Mar 10, 2023, 03:16 PM IST
పవిత్ర నరేష్‌ పెళ్లిలో పెద్ద ట్విస్ట్.. అదంతా పెద్ద డ్రామా?

సారాంశం

సీనియర్‌ నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌ పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. 

సీనియర్‌ నటుడు నరేష్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు పవిత్ర గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. తాము ఒక్కటి కాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఓ వీడియో క్లిప్ ని పంచుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే హింట్‌ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. డైరెక్ట్‌ గా పెళ్లి చేసుకున్న వీడియోని షేర్‌ చేశాడు నరేష్‌. వేద మంత్రాలు, పండితుల, అగ్ని సాక్షిగా పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడుస్తున్న వీడియోని పంచుకున్నారు నరేష్‌. 

ఇందులో `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు మూడు ముళ్లు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు ప్రేమతో మీ పవిత్ర నరేష్‌ అంటూ ట్వీట్‌ చేశారు నరేష్‌. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులంతా స్పందిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు లేటు వయసులో ఈ ఇద్దరి పెళ్లి నెట్టింట మాత్రమే కాదు, టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే ఈ పెళ్లిలోనే పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కనిపించేది నిజం కాదనే టాక్‌ వినిపిస్తుంది. పవిత్ర లోకేష్‌, నరేష్‌ల పెళ్లి నిజం కాదని అంటున్నారు. వారిని నిజం పెళ్లి కాదని, అందులో ఏదో ట్విస్ట్ ఉండి ఉండొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇది ఓ సినిమా కోసం నరేష్‌, పవిత్ర ఆడిన డ్రామా అని తెలుస్తుంది. కొత్త సినిమా కోసం, సినిమాపై ముందస్తుగానే బజ్‌ క్రియేట్ చేయడం కోసం నరేష్‌, పవిత్ర ఇలా చేశారని తెలుస్తుంది. 

అయితే ఎంఎస్‌ రాజు రూపొందించబోతున్న సినిమా కోసం ఇదంతా చేశారని తెలుస్తుంది. ఎంఎస్‌ రాజు రిలేషన్‌ షిప్‌ లవ్‌ స్టోరీ డ్రామా నేపథ్యంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారట. అందులో నరేష్‌, పవిత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ సినిమాలోని సన్నివేశాలే ఇవి అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని విడుదల చేయబోతున్నారట. అయితే దీనికి బలం చేకూరేలా నరేష్‌ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరిగే `ఇంటింటి రామాయణం` చిత్ర ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం విశేషం. నిజంగానే పెళ్లి చేసుకుంటే ఆయన ప్రెస్‌మీట్‌ కి ఎలా వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా నరేష్‌, పవిత్ర ఆడిన డ్రామా అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు నరేష్‌కి తన మూడో భార్య నుంచి, పవిత్రకి తన భర్త నుంచి విడాకుల ఫైనల్‌ లెటర్‌ రాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు అధికారికంగా పెళ్లి చేసుకోవడానికి లేదు.  ఇవన్నీ నరేష్‌, పవిత్రలది నిజం పెళ్లి కాదని స్పష్టం చేస్తున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే