టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అన్నిరంగాల్లో ప్రయోగాలు చేయబడుతున్న ఏఐ టెక్నాలజీని, సినిమా రంగంలో కూడా ప్రవేశపెట్టి.. మరిన్ని కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం AI టెక్నాలజీ అన్ని రంగాలలో సంచలనంగా మారింది. ఈ టెక్నాలజీతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చనిపోయిన వారిని కూడా రీ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు చేయలేని పనులు ఈ టెక్నాలజీతో చేస్తున్నారు. గంటల కొద్ది సమయం తీసుకునే వాటిని కూడా ఏఐ టెక్నాలజీ నిమిషాల వ్యావధిలోనే చేసేయడంతో ఈ టెక్నాలజీని మరిన్ని రంగాలలోకి విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో సినిమా రంగంలో కూడా ఏఐ తో ప్రయోగాలు మొదలు పెట్టారు.
ఈక్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో వినూత్న ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. క్వాంటం ఏఐ గ్లోబల్‌తో కలిసి దిల్ రాజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త వెంచర్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయబోతున్నట్టు ఆయన తెలిపారు.
అంతే కాదు ఈ కంపెనీకి సబంధించిన పేరు, పూర్తి వివరాలను మే 4న వెల్లడించనున్నారు. ఈ ప్రకటనను దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది, ఈ సందర్భంగా అఫిషియల్ వెబ్ సైట్ లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు టీమ్.
ఈ కొత్త కంపెనీ ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడబోతోంది. వినోద రంగానికి ప్రత్యేకంగా రూపొందించిన అడ్వాన్స్డ్ ఏఐ సాధనాలను అభివృద్ధి చేసి అందించనుంది. దిల్ రాజు మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో ఏఐ సాంకేతికత ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు. దిల్ రాజు ప్రకటనతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలయ్యింది. అందరు దీనిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో ముందు ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం సాధించబోతున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది.