
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం తన ఫుల్ టైం ని ఫ్యామిలీ కోసమే కేటాయిస్తున్నట్లు ఉన్నారు. దిల్ రాజు ఇటీవల తన కుమారుడు అన్వై ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు.
ఇప్పుడు దిల్ రాజు, తేజస్విని దంపతులు తమ కుమారుడితో గడుపుతూ సంతోషంగా ఉన్నారు. తాం కొడుకుతో దిల్ రాజు అల్లరి చేస్తూ.. ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్వై పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించారు. తాజాగా దీనిని దిల్ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
ఈ వీడియో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ పాటని సింగర్ కార్తీక్ ఎంతో మధురంగా పాడారు. ఈ వీడియోలో దిల్ రాజు కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. దిల్ రాజు కొడుకుతో అతని మనవళ్లు మనవరాళ్లు కూడా ఆడుకుంటుండం విశేషం.
2017లో దిల్ రాజు తన సతీమణి అనితని కోల్పోయారు. దీనితో దిల్ రాజు కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. అయితే కరోనా టైంలో దిల్ రాజు తేజశ్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకి గత ఏడాది ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కొడుకే ఈ అన్వై. 2020లో దిల్ రాజుకి తేజస్వినితో వివాహం జరగగా.. 2022లో ఈ జంటకి కొడుకు జన్మించాడు. దిల్ రాజు అదృష్టవంతులు అని.. ఒకేసారి మనవళ్లు, కొడుకుతో ఆడుకునే అదృష్టం దక్కింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దిల్ రాజు ప్రస్తుతం పలు చిత్రాలని నిర్మిస్తున్నారు. అందులో ప్రముఖంగా భారీ బడ్జెట్ లో రాంచరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది.