
బాలీవుడ్ బ్యూటీ సనా ఖాన్ తెలుగు వారికి కూడా సుపరిచయమే. గ్లామర్ ఒలకబోస్తూ పలు సౌత్ చిత్రాల్లో నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య, గగనం లాంటి తెలుగు చిత్రాల్లో సనాఖాన్ మెరిసింది. ఆమె గ్లామర్ ని యువత కూడా ఫిదా అయ్యారు. కానీ మరిన్ని చిత్రాల్లో నటించలేకపోయింది.
బాలీవుడ్ లో అయితే తన అందంతో ఒక ఊపు ఊపింది. వాజహ్ తుమ్ హోం చిత్రంలో అయితే రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది సనా ఖాన్. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమై వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. 2020లో సనా ఖాన్ అనాస్ సయ్యద్ ని వివాహం చేసుకుంది.
తాజాగా ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. సన ఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సనాఖాన్ సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపింది. మాకు అబ్బాయి పుట్టాడు. మాపై ప్రేమ చూపుతున్న మీ అందరికి కృతజ్ఞతలు.
మీ అందరి దీవెనలు మాకు కావాలి అని సనా ఖాన్ పోస్ట్ చేసింది. 2005లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సనా ఖాన్ తమిళ, మలయాళీ చిత్రాలు కూడా చేసింది. ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు సంబరాల్లో ఉన్నారు.
అయితే అంతకు ముందు సనా ఖాన్ కి ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నాయి. మెల్విన్ లూయిస్ అనే కొరియోగ్రాఫర్ తో సనాఖాన్ కొంత కాలం సహజీవనం చేసింది. కానీ అతడి నుంచి ఊహించని విధంగా సనా ఖాన్ విడిపోయింది.