`పుష్ప2` టీజర్‌ రిలీజ్‌కి ముందే పూనకాలు తెప్పిస్తున్న అల్లు అర్జున్‌.. ఏంటి సామీ ఈ వేరియేషన్స్!

Published : Apr 07, 2024, 07:25 PM IST
`పుష్ప2` టీజర్‌ రిలీజ్‌కి ముందే పూనకాలు తెప్పిస్తున్న అల్లు అర్జున్‌.. ఏంటి సామీ ఈ వేరియేషన్స్!

సారాంశం

అల్లు అర్జున్‌ బర్త్ డే ట్రీట్‌ రాబోతుంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా `పుష్ప2` టీజర్‌ని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.   

అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప 2` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని సుకుమార్ డిజైన్‌ చేస్తున్న విధానం, ఐకాన్ స్టార్‌ గెటప్స్ క్రేజీగా ఉండటంతో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్ కి కూడా మైండ్‌ బ్లో చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఓ వీడియో ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది. పుష్ప బతికే ఉన్నాడన్నా అనే డైలాగ్‌ అలరించింది. ఇందులో బన్నీ అమ్మోరు గెటప్‌లో కనిపిస్తారనే వార్త పూనకాలు తెప్పిస్తుంది. జాతర ఎపిసోడ్‌ హైలైట్‌ గా నిలుస్తుందంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు టీజర్‌ రాబోతుంది. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా రేపు సోమవారం(ఏప్రిల్‌ 8న) `పుష్ప 2` టీజర్‌ని విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించగా, ఇప్పుడు రిలీజ్‌ టైమ్‌ని వెల్లడించింది. సోమవారం ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఓ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో సింహాసనంపై రాజు కూర్చున్నట్టుగా బన్నీ కూర్చున్నాడు. 

ఇందులో చేతికి ఉంగరాలతో, కలర్‌ గ్లాసెస్‌తో, మెడలో గోల్డ్ చైన్స్ తో ఉన్నాడు. సీరియస్‌ లుక్‌లో బన్నీ ఉన్నాడు. చేతిలో గొడ్డలి ఉంది. దానికి రక్తం మరకలు ఉన్నాయి. వెనకాల తన మనషులు ఉన్నారు. ఇలా పుష్పరాజ్‌గా బన్నీ లుక్‌ మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది. అయితే అంతకు ముందు డిఫరెంట్ ప్రీ లుక్స్ విడుదల చేస్తూ వచ్చింది టీమ్‌. జాతరలో కాళ్లకి గజ్జ కట్టి డాన్స్ చేస్తున్న ఫోటోని విడుదల చేశారు. 

ఆ తర్వాత అర్థనారీశ్వరుడి పోస్టర్‌ని విడుదల చేశారు, మరోవైపు త్రిశూలం పోస్టర్‌ని విడుదల చేశారు. ఇవన్నీ ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తూ వచ్చాయి. టీజర్‌ వేరే లెవల్లో ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. అయితే వాటికి పూర్తి భిన్నంగా తాజా పోస్టర్‌ని షేర్‌ చేయడం విశేషం. ఇలా ఈ డిఫరెంట్‌ వేరియేషన్స్ మతిపోయేలా చేస్తున్నాయి. టీజర్‌ రిలీజ్‌కి ముందే పూనకాలు తెప్పిస్తున్నాయి. దీంతో టీజర్‌ కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి ఇది ఈ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే టీజర్‌ రెడీ అన్నట్టుగా బన్నీ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. రేపటి కోసం వెయిట్‌ చేస్తున్నారు. 

ఈ టీజర్‌ ని బట్టే సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాలకు రావచ్చు. దీన్ని బట్టే అసలు లెక్కలన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకోసం దర్శకుడు సుకుమార్‌ భారీగా ప్లాన్‌ చేశాడట. టీజర్‌ని బాగా చెక్కాడని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో, ఇక ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్ పై మళ్లీ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15న రాబోతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇందులో ఫాహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ నెగటివ్‌ రోల్స్ చేయగా, రష్మిక మందన్నా హీరోయిన్‌. జగదీష్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.  
 

టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

20 ఏళ్ళ నాటి సీక్రెట్ చెప్పి న దీపికా పదుకొణె, షారుఖ్ కు షాక్ ఇచ్చిన నటి
నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?