సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్‌లోని మాస్ లుక్ పూర్తి స్దాయిలో బయిటకు వచ్చింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్. ఆయన హీరోగా నటించిన ‘పుష్ప’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబరు 17న విడుదల కానుంది. భారీ క్రేజ్ సంపాదించుకున్న పుష్ప హక్కులు దిల్ రాజు దక్కించుకున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప నైజాం హక్కులను దిల్ రాజు భారీ ధరకు దక్కించుకున్నారు. మొదట భారీ ధర చెప్పినా మైత్రీ మూవీస్ దిగి వచ్చి ఫైనల్ గా ఓ సెటిల్డ్ అమౌంట్ కు లాక్ చేసినట్టు సమాచారం. అయితే అదీ పెద్ద ఎమౌంటే అని ..రిస్క్ తీసుకుంటున్నారని అంటున్నారు.
నైజాం రైట్స్ ని 35 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ తర్వాత మారిన పరిస్దితుల్లో ఇంత రేటు పెట్టడం పెద్ద గాంబిలే అంటున్నారు. బిజినెస్ డైనమిక్స్ మొత్తం మారిపోయాయి. అయితే అల్లు అర్జున్ గత చిత్రం అల వైకుంఠపురములో నైజాం ఏరియాలో 40 కోట్లు వసూలు చేసింది. దాంతో పుష్పకు 35 కోట్లు దిల్ రాజు పెట్టారని అంటున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే షేర్ 35 కోట్లు షేర్ రావాలి. అలవైకుంఠపురములో చిత్రం దిల్ రాజుకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. మరో ప్రక్క అఖండ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు మంచి బిజనెస్ చేసారు. పది కోట్లు దాకా లాభం వచ్చిందని వినికిడి.
undefined
Also read ALLU ARJUN-PUSHPA : రాజమౌళితో త్వరలో సినిమా ఉంటుంది : అల్లు అర్జున్
పుష్ప విషయానికి వస్తే..ప్రమోషన్స్ విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో పబ్లిసిటీ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూకో ఓ కొత్త లుక్ తో సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు.రీసెంట్ గా ఓ టీజర్ ని ముందస్తు ట్రైలర్‌గా విడుదల చేసారు. అందులో కొన్ని సీన్స్ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది.
Also read Pushpa:హిందీ ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణం?