నన్ను చంపినా ఇది నిజం... సత్తా లేకపోయినా కోట్లు తీసుకుంటున్నారు.. హీరోలపై కరణ్ జోహార్ కౌంటర్లు

By Mahesh JujjuriFirst Published Jan 6, 2023, 9:02 AM IST
Highlights

హీరోలపై సంచలన వాఖ్యలు చేశారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. కోట్లలో రెమ్యూనరేషన్ తీసకుంటున్నారు కాని.. అంటూ హీరోల సత్తా చూపించుకోవల్సిన అవసరం ఉందంటున్నారు. 

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. హీరోల రెమ్యూనరేషన్ పై ఘాటు వాఖ్యలు చేశారు. హీరోలు తమ సత్తాను నిరూపించుకోవాలంటున్నారు. లాభాలు తెచ్చే సత్తా ఉండదు కాని కోట్లలో పారితోషికాలు మాత్రం వసూలు చేస్తున్నారంటూ.. కొందరు హీరోలపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాల వల్ల..కొందరు హీరోల వల్ల తాను చాలా నష్టపోయానంటూ రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వాఖ్యానించారు కరణ్ జోహార్. 

కొందరు బాలీవుడ్‌ హీరోల వైఖరి వల్లే హిందీ సినిమా ఆర్థికంగా నష్టాలను చూడాల్సి వస్తున్నదని అంటున్నారు కరణ్ జోహార్. దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సాధించిన ఆయన.. ముక్కుసూటిగా మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఇండస్ట్రీ నష్టాలు చూడటానికి కారణం భారీ బడ్జెట్ సినిమాలే అంటున్నారు కరణ్. అంతే కాదు ఐదు కోట్ల ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ రాబట్టలేని హీరోలు 30-40 కోట్ల పారితోషికాల్ని డిమాండ్‌ చేయడం అర్థం లేదన్నారు.

సినిమా ఎప్పుడు ఫెయిల్ కాదు అంటున్నారు కరణ్. కాని అది ఫెయిలా..హిట్టా అనేది దాని బడ్జెట్, కలెక్షన్స్ నిర్ణయిస్తున్నాయి అన్నారు. తాను నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ దీనికి బెస్ట్ ఉదాహరణ అన్నారు. ఈ సినిమాతో ఆలియా, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హెత్రాను లాంచ్ చేశాను. వాళ్ళు స్టార్లు గా ఎదిగారు కాని.. ఈసినిమా పేరుకు మాత్రమే హిట్ అయ్యింది. లాభావ విషయం పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి కూడా పోయిందన్నారు కరణ్. 

ఇలా మాట్లాడితే నన్ను హత్య చేస్తారేమో కాని ఉన్న నిజం చెపుతాను.. హిందీ సినిమాకోసం నా మనసు పరితపిస్తుంది. కాని బిజినెస్ పరంగా నిజం మాట్లాడాలి అంటే.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే సినిమా మంచి బిజినెస్ అవుతుంది. అయితే స్టార్లు రెమ్యూనరేషన్ పేరుతో.. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం వారికే వెళ్ళిపోతుంది. కాని సరైన ఓపెనింగ్స్ సాధించే సత్తా కూడా హీరోలకు ఉండాలి కదా. మరి అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అవసరమా..? అంటూ కరణ్ ప్రశ్నించాడు. 

బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు తామే సూపర్‌స్టార్స్‌ అనే భ్రమలో బతుకుతున్నారు. బయట వారిని చూడటానికి జనం ఎగబడటంతో అదే స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి అనుకోవడం పొరపాటు అవుతుంది అన్నారు. హీరోల క్రేజ్ ను బట్టి కలెక్షన్లు వస్తాయి అనుకోవడం..  నిజం కాదు. హీరోలు భ్రమల నుంచి బయపడి వాస్తవమేమిటో తెలుసుకోవాలి అన్నారు. అంతే కాదు ఓటీటీని దృష్టిలో పెట్టుకొని నూతన తారలను పరిచయం చేస్తే బాగుంటుందని కరణ్‌జోహార్‌ సూచించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పై ప్రశంసల వర్షం కురిపించారు కరణ్ జోహార్. 

click me!