
సూపర్ స్టార్ మహేష్‌బాబు లైనప్‌లో క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `SSMB28` వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది. `అతడు`, `ఖలేజా` తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. అలాగే `మహర్షి` తర్వాత మహేష్-పూజా కలిసి చేస్తున్న సినిమా కావడం విశేషం. రెండు రకాలుగానూ హిట్ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి. పైగా త్రివిక్రమ్.. `అలా వైకుంఠపురములో` హిట్ తో జోష్‌లో ఉన్న త్రివిక్రమ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రం నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కొన్ని రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో `భరత్ అనే నేను`లో ఆయన ముఖ్యమంత్రిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో ఐటీ మంత్రిగా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమని ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇందులో నిజం లేదంటోంది యూనిట్. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. మాటల మాంత్రికుడి స్టయిల్ టేకింగ్‌తో, నీట్‌గా సాగేలా ఉంటుందట. కాకపోతే ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ పుష్కలంగా ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. రాజకీయ నేపథ్యానికి సంబంధం లేదని, అవన్నీ ఉట్టి రూమర్లే అని కొట్టిపారేస్తుంది యూనిట్.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఆగస్ట్ మూడో వారంలో రెగ్యూలర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయనున్నారు. ఆ లోపు త్రివిక్రమ్ పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట. శరవేగంగా చిత్రీకరించాలని, గతంలో మాదిరిగా చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూట్ చేయాలని భావిస్తున్నారట. త్వరగా ఈ సినిమాని పూర్తి చేసుకుని రాజమౌళి మూవీకి వెళ్లిపోవాలని మహేష్ భావిస్తున్నట్టు సమాచారం.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.