అదిరిపోయిన Selfish ఫస్ట్ సింగిల్, ట్రెండింగ్ లో ‘దిల్ ఖుష్’ లిరికల్ వీడియో

By Asianet News  |  First Published May 2, 2023, 7:44 PM IST

‘రౌడీ బాయ్స్’తో అలరించిన యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫిష్’. చిత్రం నుంచి ‘దిల్ ఖష్’ పేరిట అదిరిపోయే మెలోడీ ట్రాక్ విడుదలైంది.  
 


స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు  వారసుడిగా ఆశిష్ రెడ్డి (Ashish Reddy) ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  హీరోగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆశిష్ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.  ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ‘సెల్ఫిష్’ Selfish సినిమాతో బిజీగా ఉన్నాడు. విశాల్ కాశి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

ఆశిష్ రెడ్డి రెండవ చిత్రంగా ‘సెల్ఫిష్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ప్రస్భుతం షూటింగ్ కొనసాగుతుండగా.. తాజాగా యూత్ ను ఆకట్టుకునేలా Dil Kush పేరిట లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. యూట్యూబ్ లో  మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.  

Latest Videos

లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సింగర్ జావెద్ చక్కటి గాత్రం అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ క్యాచీ ట్యూన్ ను అందించారు. నిన్న మేడే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.  ఆశిశ్ తన డాన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. #15లో ట్రెండ్ అవుతోంది. యూత్ ను ఆకట్టుకుంటోంది.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను గతేడాది ఏప్రిల్ 15న అధికారికంగా ప్రారంభించారు. కోలీవుడ్ నటుడు ధనుష్,  మరికొందరు టాలీవుడ్ దర్శకులు ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. చిత్రానికి సుకుమార్ (Sukumar) కథను అందించారు. కాశీ విశాల్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సుకుమార్, దిల్ రాజు ఇద్దరూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

Lovely moments from the song launch event ❤️

Team had an amazing time launching the song with the beloved media!

- https://t.co/Zji4KNyb8x pic.twitter.com/A6bTX5qS0O

— Sri Venkateswara Creations (@SVC_official)
click me!