డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో బన్నీ సినిమా?.. నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌ ఇదేనా?

Published : May 02, 2023, 06:44 PM IST
డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో బన్నీ సినిమా?.. నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌ ఇదేనా?

సారాంశం

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అయితే నెక్ట్స్ లో డిజాస్టర్‌  సినిమా ఇచ్చిన డైరెక్టర్‌తో  మూవీ చేయబోతున్నారట. 


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు `పుష్ప2`తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్‌ కావడానికి ఇంకా ఏడాది టైమ్‌ పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సినిమా షూటింగ్‌ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. స్క్రిప్ట్ వర్క్, లొకేషన్లు కారణాలేమైనా, కొంత ఆలస్యమవుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బన్నీ నెక్ట్స్ సినిమాలు ఎవరితో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే నెక్ట్స్ సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమాని ప్రకటించారు. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియాల్సి ఉంది. 

ప్రభాస్‌ తో ఇప్పటికే `స్పిరిట్‌`అనే చిత్రాన్ని ప్రకటించారు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన తీస్తున్న `యానిమల్‌` పూర్తయ్యాక `స్పిరిట్‌`ని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సినిమాలను కూడా బన్నీ ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. తాజాగా మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టారని సమాచారం. ఇప్పటికే అట్లీతో బన్నీ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఫైనల్‌ అని అన్నారు. కానీ తాజాగా కొత్త దర్శకులు తెరపైకి రావడం గమనార్హం. అందులో త్రివిక్రమ్‌ ఉన్నారట. ఇప్పటికే త్రివిక్రమ్‌ మూడు బ్లాక్‌ బస్టర్స్ చేశారు బన్నీ. 

`జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలు చేశారు. మూడు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుందట. మాటల మాంత్రికుడితో సినిమాని ఇప్పటికే ఫిక్స్ చేశారట. దీంతోపాటు మరో డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడి పేరు కూడా తెరపైకి రావడం విశేషం. ఇటీవల `ఏజెంట్‌` వంటి డిజాస్టర్‌ సినిమాని అందించిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, కథ ఫైనల్‌ అయి, బౌండెడ్‌ స్క్రిప్ట్ రెడీ అయ్యాక నచ్చితే ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

దర్శకుడు సురేందర్‌రెడ్డి ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మంచి టెక్నీషియన్‌. ఒకటి రెండు సినిమాలు తేడా కొట్టొచ్చు, కానీ ఆయన దర్శకుడిగా ఫెయిల్‌ కాలేరు. `ఏజెంట్‌` విషయంలో సరైన స్క్రిప్ట్ లేకుండానే ప్రారంభించారని ఇటీవల నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. అయితే సురేందర్‌రెడ్డిపై ఒత్తిడి కారణంగానే ఆయన ఇలా చేయాల్సి వచ్చిందేమో. పైగా ఆయన కరోనా, సెట్‌ ప్రమాదం వంటి వాటితో ఇబ్బంది పడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. కారణాలేమైనా `ఏజెంట్‌` డిజాస్టర్‌ అయ్యింది. అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇదిలా ఉంటే సురేందర్‌రెడ్డితో పవన్‌ కళ్యాణ్‌ ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇది ఆల్మోస్ట్ క్యాన్సిలే అని తెలుస్తుంది. 

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కిది కొనసాగింపు. మొదటి భాగం పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ కావడంతో సెకండ్‌ పార్ట్ ని మరింత లావిష్‌గా, మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. కథ పరంగానూ మరింత జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఇక ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?