
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేణు దేశాయ్ కు సర్జరీ జరిగిందా? తాజాగా ఆమె చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్‌లో రేణు దేశాయ్, తన కుమార్తె ఆద్యతో కలిసి డిన్నర్‌కు వెళ్ళిన ఫోటోను షేర్ చేస్తూ, "సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్ళాను" అని రాసుకొచ్చింది. ఇంతకీ రేణుకి ఏమయ్యింది.
రేణు దేశాయ్ ఇన్ స్టా గ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. "సర్జరీ తర్వాత" అని పేర్కొనడంతో ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయో, ఏ సర్జరీ జరిగిందో అనే విషయాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రేణు దేశాయ్ మాత్రం ఆమెకు ఎలాంటి శస్త్రచికిత్స జరిగిందో, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారో వంటి వివరాలను వెల్లడించలేదు. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఫోటోలో రేణు దేశాయ్ పింక్ డ్రెస్‌లో కనిపిస్తూ, కుమార్తె ఆద్యతో క్యూయిట్ సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆమె ముఖంలో కొంత డల్ నెస్ కనిపిస్తోంది. ఆమె అలా కనిపించడంతో ఆరోగ్య పరిస్థితి గురించి గాసిప్స్ కూడా మొదలయ్యాయి. అయినా రేణు దేశాయ్ మాత్రం ఈ విషయంలో ఇంకా స్పందించలేదు.
రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ తో ప్రేమ పెళ్లి తరువాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య ఉన్నారు. 2012లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం రేణు దేశాయ్ సినీ పరిశ్రమకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ద్వారా ఆమె మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రేణు దేశాయ్, నటనతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.