కోట మరణం కలచివేసింది, స్టార్ నటుడికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Published : Jul 13, 2025, 11:11 AM ISTUpdated : Jul 13, 2025, 08:13 PM IST
kota srinivasa rao

సారాంశం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణంపై టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్టార్ నటుడితో కలిసి పనిచేసిన క్షణాలను తలుచుకుంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. 

టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. ఆయన మరణవార్త విని ప్రముఖ తారలు షాక్ కు గురయ్యారు.కోటతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. చిరంజీవి, పవన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ, మంచు హీరోలతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

కోట శ్రీనివాసరావు మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి, తాము ఇద్దరు ఒకేసారి ప్రాణం ఖరీదు సినిమాతో కెరీర్ ను స్టర్ట్ చేశామంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్.

 

 

కోటా బాబాయ్ నా కుటుంబంతో సమానాం. ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను మర్చిపోలేను. కోట శ్రీనివాసరావు గారు, శాంతిగా విశ్రాంతి తీసుకోండి” అంటూ రవితేజ ట్వీట్ చేశారు.

 

 

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని కొనియాడారు నందమూరి బాలకృష్ణ. నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించారు,. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని బాలయ్య ప్రశంసించారు.

కోటా మరణం మనసును బాధించిందన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి . కోట ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.

 

 

సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆయన అన్నారు.

 

 

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పరిశ్రమలో ఎవరు తీర్చలేనిదనిదన్నారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు ముఖ్యమంత్రి.

 

 

కోట శ్రీనివాసరావు మరణంపై మరికొంత మంది ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: కాంట్రవర్షియల్ మూవీతో పాటు మలయాళీ థ్రిల్లర్స్, సుమ కొడుకు సినిమా.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే
హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్