
తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి ‘అథితి’ మూవీలో నటించారు బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయే సరికి సౌత్ లో ఫేమ్ కాలేకపోయింది అమృత రావు. కానీ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటోంది. అయితే బాలీవుడ్ కపుల్ గా పేరొందిన అమృత రావు (Amrita Rao), అన్మోల్ సూద్ (Anmol Sood) మధ్య జరిగిన ఘర్షణలు నెట్టింట చర్చగా మారాయి. ఎన్నో ఏండ్లు ప్రేమించుకున్న కపుల్స్ జీవితం తగాదాల బాటపట్టడం ఆశ్చర్యానికీ గురిచేస్తోంది. అది ఇప్పుడు కాదండీ.. గతంలో తమ జీవితంలో జరిగిన ఓ ఘటనను అభిమానులతో పంచుకుందీ జంట.
బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు, రేడియో జాకీ, యాంకర్ అన్మోల్ సూద్ ఒకరినొకరు కొన్నేండ్లుగా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2016లో పెళ్లి కూడా చేసుకుంది. బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించినా.. అందరిలాగే వీరిమధ్య కూడా తగాదాలు వచ్చాయి. పెళ్లికి ముందే ఇద్దరూ ఒకసారి భయంకరంగా గొడవ పెట్టుకున్నారట. దీంతో అమృత సరిగా తిండి కూడా తినలేదంట.. రోజంతా ఏడుస్తూనే ఉండేదంట. తాజాగా వారి తొలి గొడవను తమ ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు ఈ లవ్లీ కపుల్.
కపుల్ ఆప్ థింగ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ కంపుల్ తమ జీవిత విశేషాలను తెలియజేస్తూ.. స్పెషల్ డేస్ సందర్భంగా కూడా పలు వీడియోస్ తీస్తూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా ‘ఫస్ట్ ఫైట్’పేరుతో పోస్ట్ చేసిన వీడియోలో.. అన్మోల్ మాట్లాడుతూ ‘2012లో మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ అమృత ఇప్పుడేవద్దు, ముందు కెరీర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. కుదరదు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామంతే అని మొండిపట్టు పట్టాను, నాకోసం కెరీర్ మీద పెట్టుకున్న ఎన్నో ఆశలను పక్కన పెట్టి వివాహానికి అంగీకరించింది' అని అన్మోల్ చెప్పుకొచ్చాడు.
అనంతరం అమృత రావు ‘ఒకరోజైతే ఏకంగా సినిమాలు మానేయాలని అన్మోల్ చెప్పడంతో నేను షాకయ్యాను. నటనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అతడు చాలా సీరియస్‌గా చెప్పాడు. దీంతో ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత నా భర్త కోసం నేను ఎంతగానో ప్రేమించే నా సినిమా కెరీర్‌ను వదిలేయాలా? అనే ఆలోచనలో పడ్డాను’ అని తెలిపింది.
ఆ తరువాత అదే రోజు ఇద్దరూ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లగా.. అక్కడ దుఃఖం ఆపుకోలేని అమృత వెక్కివెక్కి ఏడ్చిందట. దీంతో అన్మోల్ కూడా తన పొరపాటును అర్థం చేసుకున్నాడు. రెండు రోజుల్లోనే ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పడం, తన కోసం కెరీర్ వదులుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడంతో మళ్లీ వీరి జీవితం సాఫీగా సాగడం ప్రారంభమైందట.. ఆరోజు అలా ప్రవర్తించినందుకు 12 ఏళ్లుగా అమృత రావుకు సారీ చెప్తూనే ఉన్నాడంట.