ధోని 'LGM'సినిమా రిజల్ట్ ఏంటి, హిట్టా, ప్లాఫా?

By Surya PrakashFirst Published Jul 30, 2023, 10:16 AM IST
Highlights

ఒక ఇంట్లో కోడలిగా అడుగుపెట్టడానికి ముందే అత్తాకోడళ్లకి ఒకరిని గురించి ఒకరికి తెలియాలనే ఒక కామెడీ టచ్ కాన్సెప్ట్ తో ఈ కథ నడుస్తుంది. 

సాక్షి సింగ్ ధోని నిర్మాతగా 'LGM' సినిమా రూపొంది ఈ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. వారి బ్యానర్ లో నిర్మితమైన ఫస్టు సినిమా ఇది కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. హరీశ్ కల్యాణ్ - ఇవాన జంటగా రూపొందిన ఈ సినిమాకి, రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాకు అంచనాలు అందుకోలేదని తమిళ మీడియా అంటోంది. ఫోర్స్, సిక్స్ లేని ధోని ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో అలా ఉందని అక్కడ రివ్యూలు వ్యాఖ్యానిస్తున్నారు. 

153 నిముషాలు పాటు సాగే ఈ స్టోరీ ఎంతసేపు అసలు కథలోకి వెళ్లకుండా ఎక్కువ శాతం ప్రేమ కథనే చూపటం, మాట్లాడుకుంటూ కూర్చోవటం విసుగిచ్చింది అంటున్నారు. ఓటిటి లో రిలీజ్ చేస్తే బాగుండేదని ఆ లవ్ సీన్స్ స్కిప్ చేద్దము కదా అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సినిమా తమిళ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కానట్లే అని తేలిపోయింది. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే. 
 
ఒక ఇంట్లో కోడలిగా అడుగుపెట్టడానికి ముందే అత్తాకోడళ్లకి ఒకరిని గురించి ఒకరికి తెలియాలనే ఒక కామెడీ టచ్ కాన్సెప్ట్ తో ఈ కథ నడుస్తుంది. సాధారణంగా కొత్తగా పెళ్లైన తరువాత, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం ఆ జంటను హనీమూన్ పంపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒకరి అభిప్రాయాలు .. అభిరుచుల గురించి ఒకరికి తెలుస్తాయని భావిస్తూ ఉంటారు. నిజానికి కొత్తగా పెళ్లైన అమ్మాయికి, మిగతా కుటుంబ సభ్యులను గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

Latest Videos

ముఖ్యంగా ఈ కాలం అమ్మాయిలు పెళ్లికి ముందే అత్తగారిని గురించిన ఒక అవగాహనకి రావాలని కోరుకుంటున్నారు. అలా జరగాలంటే అత్తగారితో కొన్ని రోజుల పాటు ప్రయాణించాలి .. అప్పుడే ఆమె గురించిన అసలు సంగతులు తెలుస్తాయనే ఒక విభిన్నమైన కాన్సెప్టుతో, ఎమ్మెస్ ధోని బ్యానర్లో నిర్మితమైన సినిమానే 'ఎల్.జి. ఎమ్.(లెట్స్ గెట్ మ్యారీడ్) . హీరోను ప్రేమించిన హీరోయిన్, పెళ్లి తరువాత అత్తగారితో కలిసి ఉండటానికి అభ్యంతరాన్ని తెలియజేస్తుంది. అత్తగారి తత్వం అర్థం కావడానికిగాను ఆమెతో టూర్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్రయాణంలో పదనిసలే ఈ సినిమా కథ. 

 తెలుగులోనూ ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు.  నదియా .. యోగిబాబు .. దీపా శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'లవ్ టుడే' సినిమాతో తెలుగులోను యూత్ ను ఆకట్టుకున్న ఇవాన, ఈ సినిమాతో ఇక్కడ అభిమానుల సంఖ్యను పెంచుకుంటుందేమో చూడాలి.
 

click me!