Sunny Leone:సన్నీ లియోన్‌కు హోం మినిస్టర్ వార్నింగ్‌! ఆ ఫొటో వైరల్

Surya Prakash   | Asianet News
Published : Dec 27, 2021, 09:32 AM IST
Sunny Leone:సన్నీ లియోన్‌కు హోం మినిస్టర్ వార్నింగ్‌! ఆ  ఫొటో వైరల్

సారాంశం

హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా కూడా స్పందించారు. కొందరు కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.  

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ నటించిన ఓ వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ వీడియో ఉందని అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియో మూడు రోజుల్లో తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా సన్నీ లియోన్‌తో పాటు ఆ పాట పాడిన సింగర్స్ ను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఆమె క్రిస్మస్ ట్రీ తో ఉన్న ఫొటోను వైరల్ చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే...‘మధుబన్‌ మే రాధిక నాచే’ పేరిట హిందీలో ఓ వీడియో సాంగ్‌ విడుదలైంది. షరీబ్‌, తోషి ఈ పాటను ఆలపించారు. సన్నీ లియోన్‌ నర్తించారు. 1960లో వచ్చిన ‘కోహినూర్‌’ చిత్రంలోని ‘మధుబన్‌ మే రాధిక నాచే రే’ అనే పాటలోని పల్లవిని ఈ పాటలా ఉంటుంది. పాత పాటను మహ్మద్‌ రఫీ పాడగా.. దిలీప్‌ కుమార్‌ నటించారు.  డిసెంబర్‌ 22న కొత్త పాటను విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తంచేశారు. 

తాజాగా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా కూడా స్పందించారు. కొందరు కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘మధుబన్‌ మే రాధిక’ కూడా ఆ కోవకు చెందినదేనని, ఈ వ్యవహారంలో సన్నీ లియోన్‌, షరీబ్‌, తోషి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడ్రోజుల్లోగా వీడియో తొలగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో క్రిస్మస్ ని పురస్కరించుకుని ఇనిస్ట్రాలో షేర్ చేసిన క్రిస్మస్ ట్రీ ఫొటోను జనం వైరల్ చేయటం ఆసక్తికర విషయంగా మారింది. 

ఇక మధ్యప్రదేశ్‌ హోంమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఆ పాటను విడుదల చేసిన మ్యూజిక్‌ కంపెనీ ‘సరిగమప’ లిరిక్స్‌ మార్చాలని నిర్ణయించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మార్పు చేసిన లిరిక్స్‌తో పాటు, పాట పేరును కూడా మారుస్తామని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన లిరిక్స్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 

Also read సన్నీలియోన్ ‘‘మధుబన్’’ సాంగ్‌పై రచ్చ.. ఎట్టకేలకు దిగొచ్చిన సరేగమా, ఆ లిరిక్స్ మారుస్తామని ప్రకటన

 గతంలో మంగళ సూత్రాన్ని ఉద్దేశిస్తూ ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ప్రకటనపైనా నరోత్తమ్‌ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ ప్రకటనను ఆ సంస్థ ఉపసంహరించుకుంది. డాబర్‌ రూపొందించిన మరో యాడ్‌ సైతం ఇలాంటి హెచ్చరికలే ఎదుర్కొంది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

Also read Ram Gopal Varma: షాకింగ్ నక్సలైట్ గా మారిన డైరెక్టర్ వర్మ ... ప్రత్యర్థుల గుండెల్లో హడల్!

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ