ధనుష్ కి విలన్ గా తెలుగు హీరో

Published : Mar 27, 2019, 03:55 PM IST
ధనుష్ కి విలన్ గా తెలుగు హీరో

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హిట్టందుకొని చాలా కాలమవుతోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ధనుష్ నుంచి సినిమాలు రావడం లేదు. ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా సౌత్ లోనే ఎవరు చేయని ప్రయోగంలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఆ సినిమాలో విలన్ గా ధనుష్ టాలీవుడ్ కుర్ర హీరోని ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్. అరవింద సమేత సినిమాలో సైడ్ విలన్ గా నటించిన నవీన్ చంద్ర ధనుష్ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడని సమాచారం. సినిమా కోసం స్పెషల్ లుక్ కావాలని  దర్శకుడు దురై సెంథిల్ కుమార్ ఇప్పటికే నవీన్ ను కోరినట్లు తెలుస్తోంది. 

అందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఓ వైపు కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే విలన్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో ప్రయోగాలు చేస్తున్నాడు. మరి ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమా ద్వారా ఈ తెలుగు హీరో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా