
తమిళ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైమ్ టాలీవుడ్ నుంచి నటించిన సినిమా సార్. తమిళ హీరోయినా తెలుగు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉన్న హీరో ధనుష్. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అయిన ఈసినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అంతే కాదు తమిళంలో కన్నా.. తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈసినిమా పిబ్రవరి 17న రిలీజ్ అయ్యి.. సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ గతంలోనే దక్కించుకుంది. అయితే అప్పుడు మాత్రం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.ఈనెల అంటే మార్చి 22 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈవిధంగా సార్ మూవీ మేకర్స్ డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈసినిమాకు ఇప్పటికీ తెలుగులో కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. తెలుగు నిర్మాణ సంస్థ, తెలుగు దర్శకుడి సినిమా కావడంతో.. దానికి తోడు ధనుష్ ఇమేజ్ కూడా కలవడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది సార్ మూవీ. అంతే కాదు ఈసినిమా పాటలకుకూడా మంచి రెస్పాన్స వస్తోంది. ఈ సినిమాను సితార సంస్థ నిర్మించింది. ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.
ఇక ఈ సినిమా తరువాత తెలుగులో మరో సినిమా చేయాల్సి ఉంది ధనుష్. సార్ మూవీ కంటే ముందుగా అనుకున్న శేఖర్ కమ్ముల సినిమా పెండింగ్ లో ఉంది. పలు కారణాల వల్ల శేఖర్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి.. వెంకీ అట్లూరితో సినిమా చేవాడు ధనుష్. ఇక శేఖర్ తో ధనుష్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. అసలు ఉంటుందా..? ఏదా అన్నదానిపై కూడా ఎటువంటి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక తెలుగులో మరికోంత మంది దర్శకులు ధనుష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.