హీరోయిన్ తో డైరెక్టర్ విడాకుల వ్యవహారం.. నీకూ ఒక రోజు వస్తుంది అంటూ కఠినమైన సలహా ఇచ్చిన ధనుష్

Published : Mar 04, 2023, 02:34 PM IST
హీరోయిన్ తో డైరెక్టర్ విడాకుల వ్యవహారం.. నీకూ ఒక రోజు వస్తుంది అంటూ కఠినమైన సలహా ఇచ్చిన ధనుష్

సారాంశం

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెలుగు వారికి కూడా పరిచయమే. 7జి బృందావన కాలనీ చిత్రంతో సెల్వరాఘవన్ దర్శకుడుగా మంచి గుర్తింపు పొందారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ఆయన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే చిత్రం తెరకెక్కించారు.

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెలుగు వారికి కూడా పరిచయమే. 7జి బృందావన కాలనీ చిత్రంతో సెల్వరాఘవన్ దర్శకుడుగా మంచి గుర్తింపు పొందారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ఆయన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే చిత్రం తెరకెక్కించారు. ఇక తన సోదరుడు ధనుష్ తో సెల్వరాఘవన్ అనేక చిత్రాలు రూపొందించారు. 

7 జి బృందావన కాలనీ చిత్రంలో హీరోయిన్ గా మెరుపులు మెరిపించి సోనియా అగర్వాల్ ని సెల్వరాఘవన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  2006లో వీరిద్దరూ వివాహం చేసుకోగా.. 2010లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సోనియా సింగిల్ గానే ఉంటోంది. సెల్వరాఘవన్ మాత్రం గీతాంజలి అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. 

అయితే ఇటీవల సెల్వరాఘవన్ ఓ ఇంటర్వ్యూలో సోనియా అగర్వాల్ తో విడాకులు అప్పటి పరిస్థితుల గురించి వివరించాడు. కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఆ సమయంలో నా తమ్ముడు ధనుష్ ఒక సలహా ఇచ్చాడు. దీని నుంచి నువ్వు త్వరగా బయట పడాలి. నీకంటూ ఒక రోజు వస్తుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పటి వరకు ఒంటరిగానే ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత నా లైఫ్ లోకి గీతాంజలి వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అని సెల్వరాఘవన్ తెలిపారు. 

2011లో సెల్వరాఘవన్ గీతాంజలిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే సోనియా మాత్రం ఒంటరిగానే ఉంటోంది. అన్నకి సలహా ఇచ్చాడు సరే.. ధనుష్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్ కూడా గత ఏడాది ఐశ్వర్య రజినీకాంత్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Nagababu: ఆ ఫ్యామిలీతో జీవితంలో సినిమా చేయకూడదు అనుకున్న మెగా బ్రదర్..ఎలా అవమానించారో తెలుసా ?
Gundeninda Gudigantalu: తాగొచ్చిన బాలుకి చుక్కలు చూపించిన మీనా..కోపాలు తగ్గించుకుని ఎలా ఒక్కటయ్యారంటే