Mama Mascheendra : ఫస్ట్ గెటప్ లో అలా.. సెకండ్ గెటప్ లో గ్యాంగ్ స్టార్ లా.. ఆసక్తి పెంచుతున్న సుధీర్ బాబు!

By Asianet News  |  First Published Mar 4, 2023, 1:35 PM IST

సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ నుంచి వరుస అప్డేట్స్ ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో మూడు  గెటప్స్ లలో కనిపించనున్న సుధీర్ బాబు రెండో గెటప్ కు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.   


సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మామ మశ్చీంద్ర’ (Mama Mascheendra). చిత్రానికి హర్షవర్దన్ దర్శకత్వం  వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్పెస్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటోంది. 

‘మామ మశ్చీంద్ర’లో సుధీర్ బాబు మొత్తం మూడు గెటప్స్ లో కనిపించబోతున్నారని ఇప్పటికే యూనిట్ ప్రకటించిన  విషయం తెలిసిందే. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో గెటప్ లోని సుధీర్ బాబు లుక్ ను పరిచయం చేస్తున్నారు. మొన్న ‘దుర్గ’ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సిక్స్ ప్యాక్ తో ఉండే ఈహీరో లావుగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా రెండో గెటప్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

Latest Videos

‘పరుశురామ్’గా  సుధీర్ బాబు సూపర్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. భారీ గడ్డం, సూట్ లో చాలా హుందాగా కనిపించారు. చేతిలో గన్, కళ్లాదాలు  పెట్టుకొని  గ్యాంగ్ స్టర్ లా దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. మొదటి గెటప్ తో పోల్చితే ఈ లుక్ పూర్తి భిన్నంగా  కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈక్రమంలో మార్చి 7న విడుదల కానున్న మూడో గెటప్ కు సంబంధించిన  లుక్ ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

ఇక సినిమా  సినిమాకు చాలా మార్పు కనబరుస్తూ వస్తున్నారు యంగ్ హీరో, నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu). విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయినా సాలిడ్ పడటం లేదు. చివరిగా విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్’చిత్రాలు  కథపరంగా  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ బాక్పాఫీస్ వద్ద అంతగా జోష్ కనిపించలేదు. దీంతో తదుపరి చిత్రం ‘మామ మశ్చీంద్ర’తోనైనా హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందిస్తున్నారు.  

We decided one surprise wasn't enough 😁 Meet !! pic.twitter.com/WNW2PVsWR5

— Sudheer Babu (@isudheerbabu)
click me!