బాలీవుడ్ ను గట్టిగా టార్గెట్ చేశాడు అల్లు అర్జున్. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. తొందరపడకుండా తెలివిగా ఆలోచిస్తున్నాడు. ఈసారి తగ్గేదే లే అంటున్నాడు ఐకాన్ స్టార్.
అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు. టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎదిగిన అల్లు అర్జున్.. ఆతరువాత తనకంటూ సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు. స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.. సొంత బ్రాండ్ తో పాటు..ఓన్ ఫ్యాన్ బేస్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈక్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగాడు.. వెలుగుతున్నాడు కూడా. ఈక్రమంలోనే ఆయనకు తెలుగుతో పాటు మలయాళంలో కూడా స్టార్ డమ్ వచ్చింది. తెలుగు సినిమాలు మలయాళంలో డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో.. అక్కడ కూడా నెంబర్ 1 పోజీషన్ లో కొనసాగుతున్నాడు బన్నీ. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలవడంతో పాటు.. స్టార్ హీరో స్టేటస్ ను కూడా కట్టబెట్టారు మలయాళ ప్రేక్షకులు. మాలీవుడ్ లో యూత్ లో బన్నీకి భారీగా క్రేజ్ ఉంది.
ఇక ఈక్రమంలోనే బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈసినిమా ఓవర్ ఆల్ ఇండియాను ఆకర్షించింది. సౌత్ ల మాత్రమే స్టార్ హీరోగా ఉన్న బన్నీని... నార్త్ ఆడియన్స్ కూడా ప్రేమించడం స్టార్ట్ చేశారు. పుప్ప సినిమా బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించి పెట్టింది. ఈసినిమాలో బన్నీ పెర్ఫామెన్స్ కు దేశం అంతా ఫిదా అయ్యింది. దాంతో ఆయనకు బాలీవుడ్ నుంచి కూడా భారీగా ఆఫర్లు వచ్చాయి. అయినా సరే తొందరపడుకుండా ఆలోచించి అడుగులు వేస్తున్నాడు బన్నీ.
బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా బన్నీతొందరపడుకుండా..చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు పుష్ప వల్ల వచ్చిన పాన్ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం..ప్రయత్నం చేస్తూనే..పుష్ప2 తో ఆ ఇమేజ్ ను గట్టిగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాడు. పుష్ప2 ను కూడా బ్లాక్ బస్టర్ వైపు నడిపించి.. బాలీవుడ్ లో బేస్ ను స్ట్రాంగ్ గా ఏర్పాట్ చేసుకోవాలి అని చూస్తున్నాడు. ఇక ఈ ప్రయత్నంలో భాగంగానే సందీప్ వంగాతో సినిమాను అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయకుండా.. టాలీవుడ్ దర్శకుడు తో బాలీవుడ్ లో సినిమా చేస్తూ.. పాన్ ఇండియా లెవల్లో మూవీతో తీసుకెళ్ళబోతున్నాడు బన్నీ.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో క్రేజీ మూవీకి శ్రీకారం చుట్టారు అల్లు అర్జున్. సందీప్ కలిసి ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ బాలీవుడ్‌లో నేరుగా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయనకు పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం దక్కింది. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి కాంబినేషన్ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
ఈసినిమా తరువాత బన్నీతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి స్టార్ ప్రొడ్యూసన్లు, స్టార్ డైరెక్టర్లు లైన్ కడుతున్నారు. ముఖ్యంగా బన్నీకి సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహాన్ లాంటి స్టార్ మేకర్స్ నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. కాని బన్నీ ఏం సమాధానం చెప్పాడు అనేది తెలియాల్సి ఉంది. అంత పెద్ద మేకర్స్ తో సినిమాని వదిలేసుకోలేదు అల్లు అర్జున్. దీన్ని బట్టి చూస్తే.. స్టార్ మేకర్స్ తో బాలీవుడ్ నుంచి బన్నీ సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో అల్లు అర్జున్ ను గ్లోబల్ స్టార్ గా చూసినా ఆశ్చర్యపోవల్సి న అవసరం లేదు.