
సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్ చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన క్రియేట్ చేసే పాత్రల మధ్య ఎమోషన్స్‌ని క్యారీ చేసే తీరు.. అల్టిమేట్ అంటారు ఆయన సినిమాల్ని ఇష్టపడేవాళ్లు. చాలామంది బాపు, విశ్వనాథ్ లాంటి లెజెండరీ సినిమాలకు నెక్స్ట్ వెర్షన్‌లా వుంటాయి శేఖర్ కమ్ముల మూవీస్ అంటూ ఉంటారు.
ఈ సెన్సిబుల్ డైరెక్టర్ గత చిత్రం ‘ఫిదా’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలకానుంది. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రం ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన సినిమాలో నటించే హీరో ఎవరూ అంటే ధనుష్ అని తెలుస్తోంది.
శేఖర్ కమ్ములతో ట్రైలింగ్వల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట ధనుష్. త్వరలోనే వీరి కలయిక మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్న ధనుష్ ఈసారి భిన్నంగా ట్రై చేయాలని, తెలుగు స్ట్రయిట్ సినిమా చేయాలని శేఖర్ కమ్ములను చూజ్ చేసుకున్నారని అంటున్నారు. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది.
వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లవ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల.. ఈ సినిమా పూర్తికాగానే ధనుష్‌తో చిత్రం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కొత్త చిత్రం ‘జగమే తంతిరం’ కూడ ఈ రోజు నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలకానుంది.