Shraddha Kapoor Birthday : శ్రద్దా కపూర్ కు ఫ్యాన్ బర్త్ డే గిఫ్ట్... ఏం ఇచ్చాడో తెలుసా?

Published : Mar 02, 2022, 04:38 PM IST
Shraddha Kapoor Birthday : శ్రద్దా కపూర్ కు ఫ్యాన్ బర్త్ డే గిఫ్ట్... ఏం ఇచ్చాడో తెలుసా?

సారాంశం

ప్రభాస్ హీరోయిన్ (Prabhas) శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం ముంబాయ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా డైహార్డ్ ఫ్యాన్ ఒకరు శ్రద్దా కపూర్ కు మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చి.. అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ తెలిపారు.   

బాలీవుడ్ బ్యూటీ  శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) ప్రభాస్ నటించిన ‘సాహో’(Sahoo) మూవీలో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు బాలీవువడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. అయితే  శ్రద్ధా కపూర్ ముంబైలో 1987 మార్చి 3న జన్మించింది. రేపు శ్రద్ధా కపూర్ 35వ పుట్టిన రోజు.  కాగా ఆమె తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ముంబాయిలో కాకుండా ఓ స్పెషల్ ప్లేస్ లో నిర్వహించుకోనుంది. ఇందుకోసం తను ముంబైలోని ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. 

ఈ సందర్భంగా  శ్రద్ధా కపూర్ రాకా కోసం ఎదురుచూస్తున్నడైహార్డ్ ఫ్యాన్స్ శ్రద్ధా కపూర్ ను కలిసి అడ్వాన్స్ గా బర్త్ డే విషేస్ తెలియజేశారు. ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ మెమోరబుల్ గిఫ్ట్ అందించారు.  శ్రద్ధా కపూర్ తన కేరీర్ లో చేసిన చిత్రాల కవర్ ఫొటోలను అల్బమ్ గా చేసి బహూకరించారు. అలాగే శ్రద్ధా బర్త్ డే కోసం ఓ గిఫ్ట్ ను స్పెషల్ గా తయారు చేయించి అందించారు. ఇందుకు శ్రద్ధా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లిపోయింది. తన తండ్రి శక్తి కపూర్ (Shakti Kapoor) కూడా శ్రద్ధా కపూర్ వెంట బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్తున్నారు. 

 

మరోవైపు శ్రద్ధా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటో అంటూ  నెట్టింట వైరల్ అవుతోంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠత నటి శ్రద్ధా కపూర్ ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు.  అయితే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, వారిలో ఎవరూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇక చివరిగా టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)తో భాగీ 3లో కలిసి నటించింది శ్రద్ధా కపూర్. కొంత గ్యాప్ తర్వాత ఈ ఏడాది మరోసినిమాకు సైన్ చేసింది. దర్శకుడు లవ్ రంజన్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?
'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. చిరంజీవి నన్ను పిలిచి ఇలా అన్నాడు'