ధమాకా ఫస్ట్ గ్లిమ్ప్స్... రవితేజ పిచ్చ రొమాంటిక్ గా!

Published : Aug 31, 2022, 05:38 PM ISTUpdated : Aug 31, 2022, 05:47 PM IST
ధమాకా ఫస్ట్ గ్లిమ్ప్స్... రవితేజ పిచ్చ రొమాంటిక్ గా!

సారాంశం

వినాయక చతుర్థి సందర్భంగా రవితేజ ధమాకా మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. దర్శకుడు రవితేజను చాలా రొమాంటిక్ గా ప్రజెంట్ చేశాడు.   

వరుస చిత్రాలతో రవితేజ బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్సకత్వంలో ధమాకా చిత్రం చేస్తున్నారు. నేడు వినాయక చతుర్థి పురస్కరించుకుని చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. ఓ పెళ్లి వేడుకలో హీరోయిన్ శ్రీలీల వైపు ఓరగా చూస్తూ రవితేజ పక్కకు పిలవడం చాలా రొమాంటిక్ గా ఉంది. చాలా కాలం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజలోని రొమాంటిక్ యాంగిల్ బయటకు తీసినట్లు అనిపిస్తుంది. 

గతంలో త్రినాధ్ రావు తెరకెక్కించిన నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. మరి మాస్ ఇమేజ్ ఉన్న రవితేజను ఆయన ఎలా ప్రెజెంట్ చేయనున్నారో చూడాలి. పెళ్లి సందడి(2021) ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ విడుదల చేశారు. 

మరోవైపు క్రాక్ హిట్ తర్వాత రవితేజ రెండు వరుస ప్లాప్స్ అందుకున్నారు. ఆయన నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ముఖ్యంగా రామారావు ఆన్ డ్యూటీ ఆయన ఫ్యాన్స్ ని సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్త దర్శకులతో సినిమాలు చేయొద్దని ఆయనను వేడుకున్నారు. కాగా రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర అనే మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మెగా 154 మూవీలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ