మహేష్‌ సినిమాలో హీరో తరుణ్‌.. రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన లవర్‌ బాయ్‌

Published : Aug 31, 2022, 02:06 PM IST
మహేష్‌ సినిమాలో హీరో తరుణ్‌.. రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన లవర్‌ బాయ్‌

సారాంశం

 ఒకప్పుడు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన హీరో తరుణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారని, మహేష్‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి.  తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌(Maheshbabu) హీరోగా,  త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. `SSMB28` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇందులో ఒకప్పుడు లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన హీరో తరుణ్‌(Tarun) కీలక పాత్రలో నటిస్తున్నారని, మహేష్‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. 

ఆ మధ్య `అల వైకుంఠపురములో` హీరోగా రాణిస్తున్న సుశాంత్‌ని కీలక పాత్రలో నటింప చేశారు త్రివిక్రమ్‌. అలాగే ఇప్పుడు మహేష్‌ సినిమాలో తరుణ్‌ని కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు, ఈ చిత్రంతో తరుణ్‌ కూడా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హీరో తరుణ్‌ స్పందించారు. రూమర్లలో నిజం లేదని స్పష్టం చేశారు. 

తనని మహేష్‌ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. ఈ వార్త నిజం కాదని వెల్లడించారు. తనకు సంబంధించిన ఎలాంటి వార్త ఉన్నా తన అభిమానులతో పంచుకుంటానని అన్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో సందడి చేసిన తరుణ్ కొంత కాలంగా సినిమాలకు గాప్ తీసుకున్నారు. ఆయన నటించిన సినిమాలు కూడా పరాజయం చెందడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఆయన రీఎంట్రీ ఎప్పుడుంటుందనేది ఆసక్తికరంగా, పెద్ద సస్పెన్స్ గా మారింది. 

బాలనటుడిగా తెలుగు తెరపై సందడి చేశారు తరుణ్‌. `అంజలి` చిత్రానికిగానూ బాలనటుడిగా ఏకంగా జాతీయ అవార్డుని అందుకున్నారు. `నువ్వే కావాలి` చిత్రంతో హీరోగా బ్రేక్‌ అందుకున్నారు. ఈ చిత్రంతో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. వరుసగా `ప్రియమైన నీకు`, `చిరుజల్లు`, `నువ్వు లే నేను లేను`, `అదృష్టం`, `నువ్వేనువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `నీ మనసు నాకు తెలుసు`, `సోగ్గాడు`, `శశిరేఖ పరిణయం`వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు. దాదాపు అన్నీ ప్రేమ కథ చిత్రాలే చేశారు. అందుకే లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడలేకపోయారు. 

`వేట` చిత్రంతో రూట్‌ మార్చాడు. యాక్షన్‌ సినిమా చేశాడు. కానీ అప్పటికే వరుసగా పరాజయాలు రావడంతో తరుణ్‌ని ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత తాను కూడా కెరీర్‌ పరంగా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. లవ్‌ ఫెయిల్యూర్‌ వంటి కారణాలతో ఆయన సినిమాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. తరుణ్‌ రీఎంట్రీపై ఇప్పుడు అందరిలోని ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ నయా రూమర్లతో మరోసారి వార్తల్లో నిలిచారు తరుణ్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ