దేవిశ్రీప్రసాద్ సీన్ అయిపోయిందా..?

Published : Dec 04, 2018, 10:28 AM IST
దేవిశ్రీప్రసాద్ సీన్ అయిపోయిందా..?

సారాంశం

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు దేవిశ్రీప్రసాద్. ఒక్కో సినిమాకి మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే దేవిశ్రీ తన కెరీర్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించాడు.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు దేవిశ్రీప్రసాద్. ఒక్కో సినిమాకి మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే దేవిశ్రీ తన కెరీర్ లో ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించాడు. ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయినా.. ఆయన పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యేవి.

అంతటి క్రేజ్ తో దూసుకుపోయిన దేవిపై ఇప్పుడు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కి 'రంగస్థలం' వంటి హిట్ ఆల్బం ఇచ్చిన దేవిశ్రీ మరోసారి అతడితో కలిసి పని చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న 'వినయ విధేయ రామ' సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. సాధారణంగా సినిమాలో బెస్ట్ సాంగ్ ని ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ 'వినయ విధేయ రామ'లో ఫస్ట్ సాంగ్ ఆకట్టుకునే రేంజ్ లో లేదనే చెప్పాలి.

దీంతో అభిమానుల్లోకంగారు మొదలైంది. ఆడియోలో ఇదే వీకెస్ట్ సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. మెలోడీ, ఫాస్ట్ బీట్, ఐటమ్ సాంగ్స్ ఇలా ఎలాంటి పాటలోనైనా తన మార్క్  చూపించే దేవిశ్రీ ఇప్పుడు మాత్రం సరైన ట్యూన్స్ అందించలేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. 

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

PREV
click me!

Recommended Stories

Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే