మహేష్ కొరటాల సినిమా టైటిల్ అదే.. తేల్చేసిన దేవీశ్రీ

Published : Mar 16, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మహేష్ కొరటాల సినిమా టైటిల్ అదే.. తేల్చేసిన దేవీశ్రీ

సారాంశం

మహేష్ కొరటాల సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చినదేవీశ్రీ ప్రసాద్ ప్రస్థుతం మహేష్ కొరటాల మూవీ కంపోజిషన్ ఫిక్స్ చేసేందుకు కసరత్తు దేవీ శ్రీ ప్రసాద్ స్టూడియోలో కొరటాల.. ట్విట్టర్ లో భరత్ అను నేను.. అనే టైటిల్ కోట్ చేసిన దేవీశ్రీ

మురుగదాస్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా టైటిల్పై క్లారిటీ వచ్చేసింది.  ప్రస్తుతం మహేష్, కొరటాల శివల సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

తన స్టూడియోలో జరుగుతున్న మ్యూజిక్ సిట్టింగ్స్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, హ్యాష్ ట్యాగ్లలో 'భరత్ అనే నేను' అనే ట్యాగ్ను పోస్ట్ చేశాడు. చాలా రోజులుగా ఈ టైటిల్లో ప్రచారంలో ఉన్నా.., యూనిట్ సభ్యుల నుంచి మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం దేవీ శ్రీ ట్వీట్తో టైటిల్ ఇదే అన్న క్లారిటీ వచ్చేసిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

 

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి.., ఇంత వరకు టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఏదీ  రిలీజ్ కాలేదు.

 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?