#Devara:ఎటూ తేల్చని 'దేవర' నిర్మాతలు,ప్రస్టేషన్ లో ఫ్యాన్స్ ?

ఈ విషయమై నిర్మాతల నుంచి అప్డేట్ ప్రకటన ఏమీ రాలేదు.  బయిట ఇంత జరుగుతున్నా నిర్మాతలు ఖండించటం కానీ కొత్త డేట్ ప్రకటన చేయకపోవటం కానీ అభిమానులను ప్రస్టేషన్ లో పడేస్తోంది. 


‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  గ్లింప్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌, గ్లింప్స్ లో   చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. అలాగే తాజాగా ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.

 అంతా బాగానే ఉంది.ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లుగా ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.  దేవరకు సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ చాలా టైమ్ తీసుకుంటున్నారట. 

Latest Videos

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో ఆ ప్లేస్ లోకి ప్యామిలీ స్టార్ చిత్రం వస్తోంది. అయితే ఈ విషయమై నిర్మాతల నుంచి అప్డేట్ ప్రకటన ఏమీ రాలేదు.  బయిట ఇంత జరుగుతున్నా నిర్మాతలు ఖండించటం కానీ కొత్త డేట్ ప్రకటన చేయకపోవటం కానీ అభిమానులను ప్రస్టేషన్ లో పడేస్తోంది. 

 ఇక  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

click me!