`దేవర` క్రేజీ అప్‌డేట్‌.. యాక్షన్‌ షురూ చేసిన తారక్‌

Published : Jul 31, 2023, 05:59 PM ISTUpdated : Jul 31, 2023, 06:02 PM IST
`దేవర` క్రేజీ అప్‌డేట్‌.. యాక్షన్‌ షురూ చేసిన తారక్‌

సారాంశం

శరవేగంగా షూటింగ్‌ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. 

ఎన్టీఆర్‌(NTR).. `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి గ్లోబల్‌ ఫిల్మ్ తర్వాత చేస్తున్న చిత్రం `దేవర`(Devara). సందేశాన్ని, కమర్షియల్‌ అంశాలను జోడించి అద్భుతమైన సినిమాలు తీయగల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ని పక్కన పెడితే ఎన్టీఆర్‌ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మూవీ ఇది.

దాదాపు ఏడాదిపాటు లేట్‌గా షూటింగ్‌ స్టార్ట్ అయినా, గ్యాప్‌ లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. శరవేగంగా షూటింగ్‌ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ (Devera Shooting Update) ఇచ్చింది యూనిట్‌. కొత్త షెడ్యూలర్‌ స్టార్ట్ అయ్యింది. చిన్న గ్యాప్‌ తర్వాత నేటి(సోమవారం) నుంచి తదుపరి చిత్రీకరణ ప్రారంభించారట. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది `దేవర` యూనిట్‌. 

`షార్ట్ బ్రేక్‌, కొన్ని రోజుల రిహార్సల్స్ తర్వాత భారీ స్థాయిలో యాక్షన్‌ సీక్వెన్స్ తీసేందుకు నేటి నుంచి సెట్స్ పైకి తిరగొచ్చాం` అని వెల్లడించింది. ఇందులో నీటి(సముద్రం)లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నారట. సినిమాకవి హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన మూడు షెడ్యూల్స్ కంప్లీట్‌ చేశారు. అయితే సినిమాలోని యాక్షన్‌ సీన్స్ మొదట కంప్లీట్‌ చేయబోతున్నారని, ఆ తర్వాత టాకీ పార్ట్ షూట్‌ చేయనున్నట్టు సమాచారం. 

సముద్ర తీర ప్రాంతం బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. గుర్తింపుకు నోచుకుని, అందరు వదిలేసిన ఓ తీర ప్రాంతంలో సాగే కథ ఇది అని తెలుస్తుంది. అక్కడ మనుషులకు భయం అంటే తెలియదట. దేవడంటే భయం లేదు, చావంటే అసలే భయం లేదట. అత్యంత క్రూరంగా ఉంటారని, అలాంటి వారికి హీరో ఎలా భయం తెప్పించాడు, వారిని ఎలా ఎదుర్కొన్నారు, వారిని ఎలా సరైన దారిలో పెట్టాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

`దేవర` మూవీ భారీ లావిష్‌గా, భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు కొరటాల. దీనికి హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్ పనిచేస్తున్నారు. వీరితోపాటు అనిరుధ్ సంగీతం అందిస్తున్న చిత్రానికి సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..