ఇండియన్ సినిమాలో ఎంతోమంది లెజెండ్స్ తమ నటనతో ప్రేక్షకులని అలరించారు. బాలీవుడ్ లెజెండ్రీ నటుల్లో భగవాన్ దాదా ఒకరు. ఒకప్పుడు ఈయన ఇండియాలోనే ధనికుడైన నటుడిగా వెలుగొందారు.
ఇండియన్ సినిమాలో ఎంతోమంది లెజెండ్స్ తమ నటనతో ప్రేక్షకులని అలరించారు. బాలీవుడ్ లెజెండ్రీ నటుల్లో భగవాన్ దాదా ఒకరు. ఒకప్పుడు ఈయన ఇండియాలోనే ధనికుడైన నటుడిగా వెలుగొందారు. కానీ చివరకు ఆస్తి మొత్తం పోగొట్టుకుని మురికివాడలో దుర్భర జీవితం గడిపిన విషాదగాధ ఆయన జీవితం. వినడానికి సినిమా కథలాగా ఉన్నా భగవాన్ జీవితం అలాగే సాగింది.
చివరి రోజుల్లో విషాదం అంటే మనకి సావిత్రి గారు గుర్తుకు వస్తారు. సిల్క్ స్మిత జీవితం కూడా అలాగే సాగింది. అంతకి మించిన ట్రాజిడీ భగవాన్ దాదా జీవితం. ఆగష్టు 1న ఆయన జయంతి కావడంతో భగవాన్ దాదా లైఫ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి. ఆయన అసలు పేరు భగవాన్ ఆబాజి పలావ్. కుస్తీలో ఆయనకి మంచి ప్రావీణ్యం ఉంది. దీనితో అంతా ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచేవారు. 1913 జన్మించిన భగవాన్ 1938 నుంచే చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన భగవాన్ దాదా దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. ఆ తర్వాత హీరోగా కూడా విజయాలు అందుకున్నారు. రాజ్ కపూర్ సలహాతో తెరకెక్కించిన అల్బెలా చిత్రం అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇక హీరోగా కూడానా వరుస విజయాలు అందుకుంటూ నటుల్లో అత్యంత ధనికుడిగా మారారు. జమేల, భాగం భాగ్ లాంటి వరుస విజయాలు భగవాన్ కి దక్కాయి.
దీనితో ఆయనకి కాసుల వర్షం కురిసింది. కానీ తన సంపాదనని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. విలాసాలకు అలవాటు పడ్డారు. అప్పట్లోనే ముంబై జుహు ప్రాంతంలో 25 గదులతో కూడిన అత్యంత విలాసవంతమైన ఇంటికి కొనుగోలు చేశారు. వారంలో ప్రతి రోజు ఒక్కో రోజు ఒక్కో కారులో తిరిగేవారట. ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిందో అంతే వేగంగా తగ్గిపోయింది. 1960 హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి పడిపోయారు. కానీ విలాసాలు మాత్రం తగ్గించుకోలేదు.
దీనితో ఆస్థి మొత్తం కరిగిపోతూ వచ్చింది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకుమొదట ఉన్న కార్లు అమ్మేసారు. ఆ తర్వాత భార్య బంగారు ఆభరణాలని అమ్మేశారు. చివరికి ఇల్లు కూడా అమ్మేసి వీధిన పడ్డారు. చివరి రోజుల్లో భగవాన్ ముంబైలో ని ఓ మురికివాడలో జీవించారు. 2002లో భగవాన్ దాదా మరణించారు.