హాట్ టాపిక్ గా కిమ్ కర్దాషియన్ హ్యాడ్ బ్యాగ్ ప్రైస్? అన్ని కోట్లా? ప్రత్యేకత ఏంటంటే..

By Asianet News  |  First Published Jul 31, 2023, 4:11 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ (Kim Kardashian) దగ్గర ఉంది. ప్రస్తుతం ఆ బ్యాగ్ ధర హాట్ టాపిక్ గ్గా మారింది. 
 


ప్రముఖ అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ పేరు ఎప్పుడూ ఇంటర్నెట్ లో ఏదో రకంగా వినిపిస్తూనే ఉంటుంది. తన ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు కర్దాషియన్ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఏ ఈవెంట్లో మెరిసినా అందరి చూపు తనపైనే పడేలా చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఓ ఫుట్ బాట్ గేమ్ చూసేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించి ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ ఫొటో అంతా వైరల్ కావడానికి ఓ కారణం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ను కిమ్ కర్దాషియన్ తన వెంట తీసుకురావడం. తన చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ ధర కోట్లల్లో ఉండటం విశేషం.  దాని ప్రైజ్ తెలిస్తే ఎవ్వరైనా సరే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాల 3,12,16,000 ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొని నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో ఆ బ్యాగ్ కాస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

Latest Videos

అసలు ఆ బ్యాగ్ కు అంత ధరపెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రత్యేక ఏముందనే సందేహం.. వచ్చే ఉంటుంది.  ఆ బ్యాగ్ ను హిర్మేస్ అనే కంపెనీ తయారు చేయడం విశేషం. అతి కొద్ది మంది కోసం ఇలాంటి బ్యాగ్ లను తయారు చేస్తుంటారంట. దాన్ని గోల్డ్, డైమాండ్స్ తో డిజైన్ చేయడం వల్ల ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాగ్ లు మార్కెట్ లో అందుబాటులో లేవు. 

ఇక కిమ్ కర్దాషియన్ ధరించిన డ్రెస్ ఖరీదు కూడా లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. వైట్ స్లీవ్ లెస్ టాప్,  లూస్ ఫిట్ ట్రౌజర్, బ్లూ షూస్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా గేమ్ ను చూసేందుకు వచ్చి సెన్సేషన్ గా మారింది. ఆమె దగ్గర కాస్ట్లీ థింగ్స్, ముఖ్యంగా చాలా రకాలా బ్యాగ్ లు ఉన్నాయి. 

ఇక కిమ్ కర్దాషియన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మింది. ప్రస్తుతం 42 ఏళ్లు. మీడియా పర్సనాలిటీగా, బిజినెస్ విమెన్ గా, మోడల్ గా, నటిగా రాణిస్తోంది. ఈ ఏడాది ‘అమెరికన్ హారర్ స్టోరీ : డెలికెట్’ అనే మూవీలో నటించింది. అలాగే ఆమె ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ కూడా తీసుకుంది. గతేడాదే కాన్యే వెస్ట్ తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కమెడియన్ పేట్ డేవిడ్ సన్ తో డేటింగ్ చేసింది. ఆ రిలేషన్ షిప్ కూడా ముగిసినట్టు వార్తలు వచ్చాయి. 

click me!