
మలయాళ నటుడు.. ఇప్పుడిపుడే తెలుగులో బిజీ అవుతున్న షైన్ టామ్ చాకో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించి అమ్మాయి మెడలో మూడు మళ్ళు వేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ స్టార్.
మలయాళ స్టార్ నటుడు షైన్ టామ్ చాకో.. అంటే ఎవరికీ అర్ధం కాకపోవచ్చు. కాని నాని దసరా మూవీలో విలన్ అంటే మాత్రం అందరికి వెంటనే గుర్తుకువస్తుంది. ఈమూవీలో పూర్ణ భర్తగా.. ఉమెనైజర్ గా చాకో పాత్ర ఆకట్టుకుంటుంది. విలన్ గా అతని హావభావాలు అద్బుతం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్న షైన్ టామ్.
ఇంతకు ముందు కూడా తెలుగులో కొన్నిసినిమాలు చేశాడు. కాని నాని దసరా సినిమాతో తనికి టాలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. గతంలో యంగ్ హీరో నాగశౌర్య ,రంగబలి సినిమాల్లో నటించిన షైన్ టామ్ కు దసరా సినిమా ప్రభావంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’లో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేశాడు.
ఇక అసలు విషయానికి వస్తే...ప్రొఫిషనల్ లైఫ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న షైన్ టామ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని కూడా కలర్ ఫుల్ చేసుకోబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడబోతున్నాడుటామ్. ప్రముఖ మోడల్ తనూజతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు షైన్ టామ్ చాకో. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇన్నాళ్లు ప్రేమ జర్నీని ఎంజాయ్ చేసిన వీరిద్దరూ.. ఇప్పుడు పెళ్లి లైఫ్ ని మొదలుపెట్టబోతున్నారు.
ఇక రీసెంట్ గా వీరిద్దరి నిశ్చితార్థం వేడుక జరిగింది. చాలా దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్యలో షైన్, తనూజ కు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు షైన్. వీరి నిశ్చితార్థం చాలా సాదాసీదాగా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షైన్ టామ్ చాకో, తనూజ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్.. నెటిజెన్స్ వారికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరి పెళ్ళి ఏ ఇయర్ లోనే జరగబోతుంది. పెళ్ళి డేట్ ఎప్పుడు అనేది కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. కాగా షైన్ టామ్ చాకోకు ఇది రెండో పెళ్ళి.