దేవదాస్ కలెక్షన్స్.. కనీసం పెట్టిన డబ్బులైన వస్తాయా?

By Prashanth MFirst Published Sep 30, 2018, 5:00 PM IST
Highlights

సినిమా మొదట రోజు కలెక్షన్స్ బాగానే అందుకున్నప్పటికీ మరుసటి రోజు నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ఏపీ - తెలంగాణలలో రూ. 4.67 కోట్ల షేర్స్ సాధించింది.

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత వచ్చిన మల్టి స్టారర్ చిత్రం దేవదాస్. నాగార్జున - నాని లాంటి స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఇకపోతే సినిమా మొదట రోజు కలెక్షన్స్ బాగానే అందుకున్నప్పటికీ మరుసటి రోజు నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 27వ తేదీన విడుదలైన ఈ సినిమా ఏపీ - తెలంగాణలలో రూ. 4.67 కోట్ల షేర్స్ సాధించింది.

అయితే శుక్రవారం ఊహించని విధంగా రెండు రాష్ట్రాల్లో షేర్స్ పరంగా రూ. 2.07 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇక శనివారం కూడా దాదాపు అదే స్థాయిలో ఈ సినిమా రూ.2.09 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 38 కోట్ల వరకు వసూలు చేయాలి. ఆ నెంబర్ దాటితేనే బయ్యర్స్ సేఫ్ జోన్ లో ఉంటారు. కానీ మొదటి వారమే సినిమా శనివారం వరకు అందిన లెక్కల ప్రకారం టోటల్ రూ.8.80 కోట్ల షేర్స్ అందుకుంది. 

ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు చాలా వరకు మొదటి వారంలోనే సగం కలెక్షన్స్ ను రాబట్టాలి. లేదంటే టార్గెట్ ను అందుకోవడం కష్టమవుతుంది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. మరి టోటల్ గా దేవ దాస్ ఏ స్థాయిలో వసూలు చేస్తారో చూడాలి. 

 

తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజుల షేర్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం - 3.40cr 

ఉత్తరాంధ్ర - 1.17cr 

సీడెడ్ - 1.27cr 

గుంటూరు - 0.85cr 

ఈస్ట్  - 0.65cr 

వెస్ట్ - 0.48cr 

కృష్ణ -0.65cr 

నెల్లూరు - 0.33cr  

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణా టోటల్: రూ.8.80cr

 

click me!