నోటా: ఓ రాజకీయ పార్టీ నిర్మించిన చిత్రం: కేతిరెడ్డి

By Prashanth M  |  First Published Sep 30, 2018, 3:39 PM IST

సినిమాపై పలు అభ్యంతరాలను తెలుపుతూ మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు చిత్ర నిర్మాత ,దర్శకుడు,సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు ఒక వినతిపత్రాన్ని పంపారు.  


యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన మొదటి ద్విభాషా చిత్రం నోటా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో విజయ్ సినిమాలు కాట్రవర్షియల్ అయినట్టుగానే ఇప్పుడు నోటాకి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.  

ఎందుకంటే సినిమాపై పలు అభ్యంతరాలను తెలుపుతూ మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు చిత్ర నిర్మాత ,దర్శకుడు,సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు ఒక వినతిపత్రాన్ని పంపారు.  ప్రధాన ఎన్నికల ఆధికారి పరిశీలించిన తరువాతే సినిమాను విడుదల చేయలని పేర్కొన్నారు. ఒక పార్టీకి సంబందించిన చిత్రంగా సినిమా తెరక్కిందని చిత్రానికి సంబంధించిన వారు ఇచ్చిన పలు ప్రకటన లలో ఇది ఒక రాజకీయ చిత్రం అని ప్రకటించరని తెలిపారు. 

Latest Videos

అదే విధంగా  ప్రచార పోస్టర్లలో సైతం హీరో ఓటు వేసిన సిరా గుర్తుతో చూపుడు వేలు ను చూపించుచు ఉండటం కరెక్ట్ కాదంటూ ప్రచార సాధనల లో వివిధ పార్టీల జెండాలను వాడడం జరిగిందని అన్నారు. "నోటా" అంటే  ఎన్నికల్లో ఓటు వేయుటకు ఇష్టం లేని వారి తిరస్కరనగా వేసే ఓటు. అయితే నోటాను వేక్కిరించే  విధంగా సన్నివేశాలు ఉన్నాయా ?  అన్న అనుమానం సగటు ప్రేక్షకులకు,రాజకీయ పార్టీల కు కలుగుతుందని తెలిపారు. 

నోటా చిత్రం లో ప్రతి సన్నివేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో త్వరలో తెలంగాణ లో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాసి నిర్మించిన ఒక రాజకీయ చిత్రమన్నారు. అలాగే ఇది ఒక రాజకీయ పార్టీ అవసరానికి నిర్మించిన చిత్రం గా తెలుస్తోందని సినిమా వర్గాల ద్వారా తెలిసినట్లు చెప్పారు. ఇక రాజకీయ వివాదాలకు తావివ్వకుండా ముందుగా ఎన్నికల కమిషన్ పోలీసు శాఖ అధికారులు, రెవెన్యూ, మరియు సెన్సార్ అధికారులు , కొందరు మేధావులు తిలకించలని చెప్పారు. అదే విధంగా చిత్రంలో అభ్యంతర సన్నివేశాలు ఉంటే తొలగించాలని కేతిరెడ్డి లేఖ ద్వారా తెలిపారు.  

click me!