దేవదాస్: ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఇంకా కావాలి!

By Prashanth MFirst Published Sep 28, 2018, 3:36 PM IST
Highlights

యువదర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తనదైన శైలిలో నాని - నాగార్జున లను ఒకటే ఫ్రెమ్ లో చూపించి దేవదాస్ తో క్లాప్స్ కొట్టించాడు. సినిమాకు పరవాలేదు అనే విధంగా టాక్ వస్తోంది . గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున కెరీర్ లో దేవ దాస్ బెస్ట్ ఓపెనింగ్స్ ను ఇచ్చింది. 

స్టార్ దర్శకులు, సీనియర్ డైరెక్టర్స్ మల్టీస్టారర్ చేయడం అంత సులువైన విషయం కాదని ఎన్నోసార్లు చెప్పారు. అయితే యువదర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తనదైన శైలిలో నాని - నాగార్జున లను ఒకటే ఫ్రెమ్ లో చూపించి దేవదాస్ తో క్లాప్స్ కొట్టించాడు. సినిమాకు పరవాలేదు అనే విధంగా టాక్ వస్తోంది . గతంలో ఎప్పుడు లేని విధంగా నాగార్జున కెరీర్ లో దేవ దాస్ బెస్ట్ ఓపెనింగ్స్ ను ఇచ్చింది. 

ఇక నాని కెరీర్ లో నేను లోకల్ తరువాత అంతటి కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ మల్టీస్టారర్ నిలిచింది. మొదటిరోజు సినిమా వరల్డ్ వైడ్ గా 12 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేయగా 7 కోట్ల వరకు షేర్స్ అందాయి. సినిమా మొత్తం థ్రియేటికల్ జిజినెస్ 38కోట్లు. అంటే ఫస్ట్ వికీ లోనే ఇంకా 30కోట్ల వరకు వసూలు చేయాలి. అప్పుడే సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యేది. 


ఇక ఏరియాల వారీగా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 

   
                                                   షేర్స్                    గ్రాస్
 

నైజం + ఆంద్రప్రదేశ్            రూ.4.6కోట్లు             రూ.6.6కోట్లు 

యూఎస్ఏ                             రూ.0.75కోట్లు           రూ.1.9కోట్లు 

కర్ణాటక                                  రూ.1.25కోట్లు           రూ.2.4కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా               రూ.0.40కోట్లు           రూ.1.1కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్                రూ.7కోట్లు                రూ.12కోట్లు

click me!