దీపిక ‘పద్మావతి’ లుక్ అదిరింది

First Published Sep 21, 2017, 3:27 PM IST
Highlights
  • దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పద్మావతి’
  • దర్శకత్వం వహిస్తున్న సంజయ్ లీలా భన్సాలీ
  • కీలక పాత్రల్లో రణవీర్, షాహిద్ కపూర్

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పద్మావతి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం లోని దీపిక ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు.

 

ఫస్ట్ లుక్ లో దీపిక సంప్రదాయ దుస్తులు ధరించి.. రాజసం ఉట్టిపడేలా ఉంది. ఒంటినిండా నగలతో  లెహంగా ధరించి పద్మావతి పాత్రలో దీపిక ఒదిగిపోయిందంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమలోనే కాకుండా పలు చిత్రాల్లో దీపిక రాయల్ లుక్ లో కనిపించినప్పటికీ.. ఈ సినిమాలో మరింత ప్రత్యేకంగా కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు. దీపిక చాలా రాజసంగా,ఠీవీగా కనిపిస్తున్నారని ఆమె అభిమానులు ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు.

 

ఈ సినిమాలో దీపికకు భర్తగా రాజా రావల్ సింగ్ క్యారెక్టర్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. రణవీర్ సింగ్ విలన్ గా అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్ లో కనిపించనున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే షాహిద్ కపూర్ మరియు రణ్ వీర్ సింగ్  ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేస్తామని తెలిపారు.

click me!