#12thFail: OTTలో ‘12th ఫెయిల్’తెలుగు వెర్షన్, డిటేల్స్

Published : Mar 05, 2024, 06:44 AM IST
#12thFail: OTTలో ‘12th ఫెయిల్’తెలుగు వెర్షన్, డిటేల్స్

సారాంశం

ప్రాంతీయ భాషల ఆడియోల్లోనూ ఈ చిత్రం రావడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అతి  తక్కువ బడ్జెట్‍తో వచ్చి ఈ మద్యకాలంలో అతి పెద్ద హిట్టైన బాలీవుడ్ మూవీ ‘12th ఫెయిల్’.స్టార్ డైరక్టర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం   బ్లాక్‍బస్టర్ అవటమే కాకుండా  అనేక మంది ప్రశంసలను పొందింది. సాధారణ ప్రేక్షకుల నుంచి చాలా మంది ప్రముఖులు కూడా ఈ మూవీని చాలా మెచ్చుకున్నారు.  ‘12th ఫెయిల్‌’ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్‌ చోప్రా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విక్రాంత్‌ మాస్సే. ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆయన పాత్రను ఈ మూవీలో పోషించారు విక్రాంత్ మాసే. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

 12th ఫెయిల్ సినిమా ఓటిటిలో వచ్చింది కానీ కేవలం హిందీ వెర్షన్‍లోనే అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం రిలీజైనా.. ఓటీటీలోకి మాత్రం హిందీ మాత్రం వచ్చింది. దీంతో 12th ఫెయిల్ తెలుగు వెర్షన్ కావాలని హాట్‍స్టార్ ఓటీటీని చాలా మంది  డిమాండ్లు చేసారు. మొత్తానికి ఇప్పుడు తెలుగు వెర్షన్ సైతం దింపారు. 12th ఫెయిల్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా నేడు అందుబాటులోకి వచ్చేసింది. అలాగే, తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

 ‘12th ఫెయిల్‌ స్టోరీ లైన్...

మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినడానికి సరిగా తిండి లేని పరిస్థితి. మనోజ్‌ తండ్రి పనిలో నిజాయతీగా ఉన్నాడన్న కారణంతో సస్పెండ్‌ అవుతాడు. చదువులో మనోజ్‌ టాపర్‌ ఏమీ కాదు. పైగా పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపల్‌ స్వయంగా ప్రోత్సహిస్తాడు. ఈ విషయం డీఎస్పీ దుష్యంత్‌ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతాడు. సగటు విద్యార్థి అయిన మనోజ్‌ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్‌ ఏం చేశాడు? 12th ఫెయిల్‌ అయినా సివిల్స్‌ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల సమాహారమే ఈ చిత్రం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ