‘ఉప్పెన’ లా ఫస్ట్ రోజు కలెక్షన్స్

Surya Prakash   | Asianet News
Published : Feb 13, 2021, 01:53 PM IST
‘ఉప్పెన’ లా ఫస్ట్ రోజు కలెక్షన్స్

సారాంశం

  మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.  


మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ తొలి రోజు కలెక్షన్స్ ఎంత అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు‌ కలెక్షన్లు కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది. మొదటి రోజు భారీ స్థాయలో కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.

ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది
►  నైజాం.. రూ.3. 08 కోట్లు
►వైజాగ్ రూ. 1. 43 కోట్లు
►ఈస్ట్ రూ. 0.98 కోట్లు
► వెస్ట్ రూ. 0.81 కోట్లు
► క్రిష్ణా రూ. 0.62 కోట్లు
► గుంటూరు రూ. 0.65 కోట్లు
► నెల్లూరు రూ. 0.35
► ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు
► సీడెడ్ రూ. 1. 35 కోట్లు
► నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు
►‌ర్ణాట‌క‌ రూ.52 ల‌క్ష‌లు
►త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు
►ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు
  

 ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దాంతో ఉప్పెన సినిమా పై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. మొదటి రోజే కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ సినిమా రాబోయే రోజుల్లో.. ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌