నిహారిక పెళ్లి భాజా మోగింది...డేట్ ఫిక్స్...పెళ్లి ఎక్కడంటే..?

Published : Nov 04, 2020, 03:57 PM ISTUpdated : Nov 04, 2020, 04:03 PM IST
నిహారిక పెళ్లి భాజా మోగింది...డేట్ ఫిక్స్...పెళ్లి ఎక్కడంటే..?

సారాంశం

మెగా డాటర్ నిహారిక పెళ్లి భాజా మోగనుంది. మరికొద్ది రోజులలో నిహారిక సింగిల్ స్టేటస్ నుండి మ్యారీడ్ లైఫ్ లోకి ప్రవేశించనుంది. నిహారిక పెళ్లి తేదీని మరియు  వేదికను నిర్ణయించేశారు. 

నిహారిక-జొన్నలగడ్డ చైత్యన్య నిశితార్ధ వేడుక జరిగి రెండు నెలలకు పైగా అవుతుంది. ఆగస్టు నెలలో బంధువులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిశితార్థం అనంతరం నిహారిక పెళ్లి వేడుక డిసెంబర్ లో ఉంటుందని తండ్రి నాగబాబు చెప్పారు. చెప్పిన విధంగానే డిసెంబర్ లో పెళ్లి తేదీ మరియు వేదిక నిర్ణయించడం జరిగింది. 

డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7:15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్ణయించగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ప్రఖ్యాత ఉదయ్ విలాస్ లో ఈ వివాహం జరగనుంది. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు చైతన్య తండ్రి ఐ జి ప్రభాకర్ రావు తెలియజేశారు. 

ఈ ఏడాది ప్రారంభంలోనే నిహారికకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన నాగబాబు, జొన్నలగ్గడ్డ చైతన్యను వరుడిగా నిర్ణయించారు. గుంటూరుకు చెందిన పోలీస్ అధికారికి ఐ జి ప్రభాకర్ రావు చిరంజీవి కుటుంబానికి చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. దీనితో ఈ సంబంధం నిశ్చయం అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?