46ఏళ్లకే లోకాన్ని విడిచిన బాలీవుడ్ నటుడు...ప్రముఖుల దిగ్బ్రాంతి

Published : Nov 04, 2020, 03:23 PM IST
46ఏళ్లకే లోకాన్ని విడిచిన బాలీవుడ్ నటుడు...ప్రముఖుల దిగ్బ్రాంతి

సారాంశం

నేడు మరో బాలీవుడ్ నటుడు అకాల మరణం పొందారు. రాణి ముఖర్జీ నటించిన హిట్ మూవీ మెహందీ లో నటించిన ఫరాజ్ ఖాన్ నేడు బెంగుళూరులో మరణించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఫరాజ్ ఖాన్ చికిత్స తీసుకుంటూ మరణించారు. ఫరాజ్ వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే.   

ఈ ఏడాది చిత్ర పరిశ్రమ అనేక విషాదాలను ఎదుర్కొంది. ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస మరణాలు సంభవించాయి. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి మేటి తారలు లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఇక టాలీవుడ్ లో జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం పొందగా, కన్నడ పరిశ్రమకు చెందిన చిరంజీవి సర్జా గుండె పోటుతో అతి తక్కువ ఏజ్ లో మరణించారు. 

లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం మరణం దేశవ్యాప్తంగా అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. కాగా నేడు మరో బాలీవుడ్ నటుడు అకాల మరణం పొందారు. రాణి ముఖర్జీ నటించిన హిట్ మూవీ మెహందీ లో నటించిన ఫరాజ్ ఖాన్ నేడు బెంగుళూరులో మరణించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఫరాజ్ ఖాన్ చికిత్స తీసుకుంటూ మరణించారు. ఫరాజ్ వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. 

ఫరాజ్ ఖాన్ మృతి వార్త తెలుసుకున్న నటి పూజ భట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ భావోద్వేగ సందేశం పంచుకున్నారు. బ్రైన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఫరాజ్ ఖాన్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు విరాళాలు సేకరించడం జరిగింది. పూజా భట్ మరియు సల్మాన్ ఖాన్ ఫరాజ్ ఖాన్ చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆపరేషన్ కొరకు రూ. 25 లక్షలు అవసరం కాగా, కుటుంబ సభ్యులు విరాళాలు సేకరించినట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..