మీసం తిప్పిన దాసరి

Published : Feb 02, 2017, 02:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మీసం తిప్పిన దాసరి

సారాంశం

దాసరి ఆరోగ్యంపై  ఆందోళన అవసరంలేదన్న మెగాస్టార్ చికిత్స కొనసాగుతోందని తెలిపిన వైద్యులు మూడు రోజుల్లో వెంటిలేటర్లు తొలగిస్తామని పేర్కొన్న వైద్యులు దాసరిని పరామర్శించిన సినీ ప్రముఖులు చిరంజీవి,మోహన్ బాబు, జయసుధ, మురళిమోహరన్  

కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గత రెండు మూడు రోజులుగా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని తెలుగు సినీ పరిశ్రమతో పాటు యావత్ తెలుగు సమాజం అంతా ఎదురు చూస్తోంది. మీసం తిప్పి మరీ తన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని దాసరి చెప్పారని, కిమ్స్ లో ఆయన్ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  దాసరి త్వరగా కోలుకోవాలని షిరిడీ సాయినాథుని వద్దకు వెళ్లి వేడుకున్నట్లు సీనియర్ నటుడు మోహన్ బాబు తెలిపారు. సినీ ప్రముఖులు చిరంజీవి,మోహన్ బాబు ,మురళీమోహన్, జయసుధ, మంచు మనోజ్ తదితరులు దాసరిని పరామర్శించారు.

 

దాసరి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్‌లో దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని.. మూడు రోజుల్లో వెంటిలేటర్ తొలగిస్తామని వైద్యులు పేర్కొన్నారు.

కాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో దాసరిని ఐసీయూలో ఉంచి వెంటిలెటర్‌ ద్వారా చికిత్సను అందిస్తున్నారు. దాసరి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు డయాలసిస్‌ చేసి, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడానికి మంగళవారం మధ్యాహ్నం ఆయనకు ఆపరేషన్‌ నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?
Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?