దాసరి పేరిట జాతీయ అవార్డులు.. `దర్శకరత్న` బయోపిక్‌

Published : Jul 11, 2021, 10:53 AM ISTUpdated : Jul 11, 2021, 10:55 AM IST
దాసరి పేరిట జాతీయ అవార్డులు.. `దర్శకరత్న` బయోపిక్‌

సారాంశం

ఇప్పటికే `దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్`ని ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు.   

దర్శక దిగ్గజం, దర్శకరత్న దాసరి స్మారకార్ధం `దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్` ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఇందుకోసం ఆయన ఇప్పటికే `దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్`ని ఏర్పాటు చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు.
  

దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు... ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో `దాసరి బయోపిక్` నిర్మించేందుకు ముందుకొచ్చారు.  ఈ బయోపిక్ కి `దర్శకరత్న` అనే టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న `దర్శకరత్న` బయోపిక్ లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారు. 
 

ఈ సందర్భంగా ఇమేజ్ ఫిల్మ్స్ అధినేత తాటివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ, `నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పం చేస్తున్నాం. అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులు అయిన ధవళ సత్యం దర్శకత్వంలో `దర్శకరత్న` పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధవళ సత్యం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. ఓ ప్రముఖ హీరో ఇందులో దాసరిగా నటించనున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం` అని అన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Brahmastra 2: వార్ 2 డైరెక్టర్ మరో భారీ ప్లాన్, ఈ మీటింగ్‌తో పెరిగిన ఊహాగానాలు