నాని దసరా సినిమా ఆగింది..? నెటిజన్ ట్వీట్ కు డైరెక్టర్ షాకింగ్ ఆన్సర్

Published : Jun 30, 2022, 05:25 PM IST
నాని దసరా సినిమా ఆగింది..? నెటిజన్ ట్వీట్ కు డైరెక్టర్ షాకింగ్ ఆన్సర్

సారాంశం

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య ప్రయోగాలు ఎక్కువగా చేస్తున్నాడు. అందులో భాగంగానే దసరా సినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈమూవీ షూటింగ్ ఆగిపోనయిందా..? ఈ డౌట్ ఓ నెటిజన్ కు వచ్చింది. అయితే దానికి దసరా సినిమా డైరెక్టర్ ఆన్సర్ కూడా అదిరిపోయింది.   

నేచురల్ స్టార్ నానికి హిట్టు, ప్లాపు.. ఇలా  తీపి చేదు కలయికతో మూవీ కెరీర్ సాగుతోంది.  లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో శ్యామ్ సింగరాయ్ తో సూపర్ హిట్ అందుకున్న నాని.. రీసెంట్ గా అంటే సుందరానికి మూవీతో ప్లాప్ మూటగట్టుకున్నాడు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా.. తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు నేచురల్ స్టార్. ఇక నానీ  ప్ర‌స్తుతం ద‌స‌రా  సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. 

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో లో సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది మూవీ. ఈ సినిమాలో నానీ సరసన హీరోయిన్ గా స్టార్ బ్యూటీ  కీర్తిసురేశ్ న‌టిస్తోంది. కాగా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందుతున్న దసరా మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో న్యూస్  చ‌క్క‌ర్లు కొడుతూంది.  

అంతే కాదు ద‌స‌రా షూటింగ్ ఆగిపోయిందని ఓ నెటిజ‌న్ పెట్టిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ న్యూస్ తో ఒక్క సారిగా టీమ్ ఉలిక్కి పడింది. దాంతో ఈ విషయంపై దసరా మూవీ  డైరెక్ట‌ర్ శ్రీకాంత్ స్పందించారు.   ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ.. బ్ర‌హ్మీ జిఫ్ ఫైల్‌తో రిప్లై ఇచ్చి పుల్ స్టాప్ పెట్టాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ  సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్‌, స‌త్య‌న్ సూర్య‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాని తొలిసారి ప‌క్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతం షూటింగ్ పూర్త‌యినట్టు స‌మాచారం. మిగతా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక నానీ దసరా తరువాత చేయాల్సిన సినిమాలపై కూడా హోమ్ వర్క్ చేస్తున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?